ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ బెదిరింపుల కేసు నమోదు అయ్యింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఆమోయ్ కుమార్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ మాజీ కమిషనర్ ఎండీ యూసఫ్‌పై 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మున్సిపల్ కమిషనర్ కప్పరి స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు. రెండున్నర కోట్లు తీసుకొని అప్పటి…
Malreddy Ranga Reddy Won From Ibrahimpatnam: తన విజయాన్ని ఇబ్రహీంపట్నం ప్రజలకు అంకితం చేస్తున్నా అని కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఆరు పథకాలు ప్రతి నిరుపేద కుటుంబానికి అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై మల్‌రెడ్డి రంగారెడ్డి గెలిచారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో ఆయనను ఇబ్రహీంపట్నం అభ్యర్థిగా ప్రకటించింది. విజయం అనంతరం ఎన్టీవీతో మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ…
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ల తరలింపు ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. 29వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్ కి పంపించ లేదు. ఈ క్రమంలో.. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆర్డీవో కార్యాలయానికి భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు.
Minister Harish Rao Election Campaign in Ibrahimpatnam: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా తెలంగాణ రాష్టంలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. 30 రోజులు మనం అందరం కలిసి కష్టపడితే.. వచ్చే ఐదేళ్లు సీఎం కేసీఆర్ సేవ చేస్తారన్నారు. కాంగ్రెస్ తమ పథకాలు కాపీ కొట్టి కొత్తగా చెబుతున్నదని విమర్శించారు. తనది అద్భుతమైన మేనిఫెస్టో అని హరీశ్ రావు పేర్కొన్నారు. రైతు బంధు సృష్టికర్త సీఎం కేసీఆర్ అని, వచ్చేసారి…
ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2022 మార్చ్ ఒకటో తేదీన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలనే రియల్టర్లపై కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను రంగారెడ్డి జిల్లా కోర్టు విధించింది.
Guru Nanak College: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కళాశాలలో కోర్సులకు యూనివర్షటీ రూ.లక్షలు వసూలు చేసి ఇప్పుడు ప్రభుత్వం అనుమతి లేదని యాజమాన్యం చేతులెత్తేసింది.
Lift Accident in VTPS: లిఫ్ట్ వైర్లు తిగిపోయి.. ఆ లిఫ్ట్ కింద పడి ముగ్గురు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్‌లో లిఫ్ట్‌వైర్ తెగిపోవడం ఒక్కసారిగా కిందపడిపోయింది.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.. ప్రమాద సమయంలో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఓవర్ లోడ్ కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.. ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడిఅక్కడే మృతిచెందగా..మరో…