ప్రతిభ ఉండాలే గానీ.. ఎక్కడైనా అది రాణిస్తుంది. గుర్తింపు పొందుతుంది. ISNEE న్యూఢిల్లీ మోటార్ స్పోర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 10 వ GKDC ఎలక్ట్రిక్ విభాగంలో గోకాట్ డిజైన్ ఛాలెంజ్ కాంపిటీషన్ లో గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్ సాధించారు. ప్రతిభకల అధ్యాపకుల పర్యవేక్షణలో సలహాలు సూచనలతో జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్ సాధించడం గొప్ప విషయం అని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయ పడ్డారు. ఈ ఛాలెంజ్ లో పాల్గొని పురస్కారాన్ని అందుకున్న విద్యార్థులను ఉద్దేశించి కళాశాల వైస్ చైర్మన్ శ్రీ గగన్ డీప్ సింగ్ కోహ్లీ మాట్లాడుతు శాస్త్రసాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతూ రోజు రోజుకు పెను మార్పులు సంభవిస్తున్నాయి.
Read Also: Acrobat : జిమ్నాస్టిక్ చేస్తు 30 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన భార్య.. మరి భర్త పరిస్థితి..?
అభివృద్ధి అనేది ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు లేకుండా అస్సలు ఊహించలేమని అందుకు అనుకూలంగా విద్యార్థులను తీర్చి దిద్దుతున్నామని జీఎన్ఐటీ యాజమాన్యం తెలిపింది. తద్వారా నూతన ఆవిష్కరణలు చేయడానికి ప్రోత్సాహం అందిస్తూ విద్యార్థుల ప్రతిభ గుర్తిస్తూ పరిశ్రమలు నెలకొల్పడానికి నాంది పలుకుతున్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్ వచ్చినందుకు గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ ఎస్ సాయిని, కళాశాల ప్రిన్సిపాల్ డా శ్రీనాథ్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ కే వెంకట రావు , జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పీ పార్థసారథి , డాక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ , హెచ్ ఓ డి డాక్టర్ విజయ్ కుమార్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.
Read Also: Allola Indrakaran Reddy : స్వంత నిధులతోనే తెలంగాణ రాష్ట్రాభివృద్ధి