పుణెలో ట్రైనీ ఐఏఎస్‌గా ఉన్న పూజా ఖేద్కర్‌కు కష్టాలు మరింత పెరిగాయి. పూజపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటీసు జారీ చేసింది.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంటికి సోమవారం అర్ధరాత్రి పోలీసులు వచ్చారు. సివిల్ డ్రస్‌లో ఉన్న ముగ్గురు మహిళా పోలీసులు ప్రత్యక్షమయ్యారు. గత కొద్ది రోజులుగా పూజా ఖేద్కర్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఇప్పటికే ఆమె సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్లు నకిలీ అని వార్తలు వినిపిస్తుండగా.. కొత్తగా మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఆమె చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు కూడా నకిలీవిగా అధికారులు గుర్తించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తవ్వేకొద్దీ ఆమె బండారం బయటడుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడి.. వేటు వేయించుకున్న ఆమె.. కొత్త కొత్త చిక్కుల్లో ఇరుక్కుంటోంది.