IAS Pooja Khedkar: మహారాష్ట్రలోని పూణె రూరల్ పోలీసులు ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐఏఎస్ అధికారి కుటుంబ సభ్యులు రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవ్వగా.. తాజాగా ఆమె తల్లి మనోరమా ఖేద్కర్ యవ్వారం మరింత రచ్చ చేస్తోంది. తుపాకీ పట్టుకుని పొలంలో ఓ రైతును బెదిరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.