తెలంగాణ కొత్త సీఎస్ ఎవరన్నది ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్ గా మారింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి నెలకొంది. డీఓపీటీ ఆదేశాల మేరకు సోమేశ్‌కుమార్‌ను విధుల నుంచి తప్పించి కొత్త సీఎస్‌ని కూడా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.
Andhra Pradesh: ఏపీలో ప్రస్తుతం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగుల హాజరు నమోదుకు ఫేస్ రికగ్నేషన్ యాప్ వాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమరావతిలోని సెక్రటేరియట్‌లో విధులు నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఫేస్ రికగ్నేషన్ యాప్ అటెండెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సెక్రటేరియట్‌లోని ఉన్నతాధికారులు ఫోన్‌లలో ఫేస్ రికగ్నేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల ఆరో తేదీ నుంచి ఫేస్ రికగ్నేషన్…
IAS Officers: మన దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉండగా అందులో 26 చోట్ల ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్(ఐఏఎస్)ల కొరత నెలకొంది. మంజూరైన ఐఏఎస్ పోస్టులు 6,789 కాగా ఉన్నది 5,317 మందే. అంటే ఇంకా 1,472 మంది ఐఏఎస్‌లు కావాలి.
ఏపీలో ఐఏఎస్ అధికారులపై రాష్ట్ర హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులో కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు సీరియస్ అయింది. కోర్టుకు హాజరైన ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, రావత్, కొన శశిధర్ పై మండిపడింది. కర్నూలులో ప్రభుత్వం డబ్బు ఇవ్వకపోవడంతో ఆత్మ హత్య చేసుకున్న కాంట్రాక్టర్ వ్యవహారంపై అధికారులను నిలదీసింది హైకోర్టు. ఆ కుటుంబానికి ఎవరు ఆసరా కల్పిస్తారని ప్రశ్నించారు హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్. అన్ని ఆర్డర్స్‌లో కోర్టు…
కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష విధించింది. ఈ కేసులో ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, వీరపాండ్యన్, అరుణ్ కుమార్‌లకు నెలరోజుల పాటు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కర్నూలు జిల్లాలో వీఏవో నియామకం విషయంలో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ధర్మాసనం తీర్పు అమల్లో ఐఏఎస్ అధికారులు నిర్లక్ష్యం వహించినందుకు హైకోర్టు జైలుశిక్ష విధించింది.…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆరుగురు ఐఏఎస్‌లకు ఊరట లభించింది… ఐఏఎస్ అధికారులకు ఈమధ్యే విధించిన సేవా శిక్షను ఎనిమిది వారాల పాటు సస్పెండ్ చేసింది హైకోర్టు… కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకుగాను కోర్టు ధిక్కరణ కేసులో ఎనిమిది మంది ఐఏఎస్‌లకు సేవా శిక్షను హైకోర్టు సింగిల్ జడ్జి విధించిన విషయం విదితమే కాగా.. ఈ శిక్షను డివిజనల్ బెంచ్‌లో గత వారం సవాల్ చేశారు.. అందులోని ఇద్దరు ఐఏఎస్ అధికారులు… దీంతో, సేవాశిక్షను ఎనిమిది వారాల పాటు సస్పెండ్ చేసింది…
ఏపీలో IAS అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆమె వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని శ్రీలక్ష్మితో సహా ఎనిమిది మందికి రెండు వారాల సాధారణ జైలు శిక్ష, ₹1000 జరిమానా విధిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ALSO READ: RK Roja: సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయను.. కళాకారుల సమస్యలు నాకు తెలుసు అనంతరం క్షమాపణలు చెప్పడంతో ఏడాదిపాటు నెలకోసారి ఏదో…
కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌లకు జైలు శిక్ష బదులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐఏఎస్ అధికారులు ఏయే జిల్లాలలోని హాస్టళ్లలో సంక్షేమ కార్యక్రమాలు చేయాలో హైకోర్టు తీర్పు కాపీలో స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయా జిల్లాల్లోని హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఓ రోజు ఏడాది పాటు సేవలందించి భోజన ఖర్చులు భరించాలని ఆదేశించింది. ఈ ప్రకారం 8 మంది ఐఏఎస్‌లకు 8 జిల్లాల కేటాయింపు…
కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారులు క్షమాపణలు కోరడంతో జైలుశిక్షను తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఏడాది పాటు సంక్షేమ హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఒకరోజు సేవ చేయాలని తీర్పు ఇచ్చింది. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్‌లను ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయవద్దన్న…