ఏపీలో IAS అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆమె వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని శ్రీలక్ష్మితో సహా ఎనిమిది మందికి రెండు వారాల సాధారణ జైలు శిక్ష, ₹1000 జరిమానా విధిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
ALSO READ: RK Roja: సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయను.. కళాకారుల సమస్యలు నాకు తెలుసు
అనంతరం క్షమాపణలు చెప్పడంతో ఏడాదిపాటు నెలకోసారి ఏదో ఒక ఆదివారం సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను సందర్శించి అక్కడి విద్యార్థులతో కొంత సమయం గడపాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయమై తనకు విధించిన శిక్షను పున:పరిశీలించాలని కోరుతూ శ్రీలక్ష్మి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. శ్రీలక్షితో పాటు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో సీనియర్ ఐఏఎస్ లు విజయ్ కుమార్, శ్యామలరావు, చినవీరభద్రుడు, గోపాలకృష్ణ ద్వివేది, యం యం నాయక్, బుడితి రాజశేఖర్, గిరిజా శంకర్ లకు కోర్టు శిక్ష విధించింది.