Telangana CS: తెలంగాణ కొత్త సీఎస్ ఎవరన్నది ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్ గా మారింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి నెలకొంది. డీఓపీటీ ఆదేశాల మేరకు సోమేశ్‌కుమార్‌ను విధుల నుంచి తప్పించి కొత్త సీఎస్‌ని కూడా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ దే తుది నిర్ణయం ఉంటుంది. రాష్ట్ర కేడర్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వసుధా మిశ్రా, రాణి కుమిడిని, శాంతి కుమారి, శశాంక్ గోయల్, సునీల్ శర్మ, రజత్ కుమార్, రామకృష్ణారావు, అరవింద్ కుమార్ ఉన్నారు. వీరిలో వసుధా మిశ్రా, శశాంక్ గోయల్, అశోక్ కుమార్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. కార్మిక శాఖకు రాణి కుమిడిని, అటవీ శాఖకు శాంతి కుమారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సునీల్ శర్మ ఇంధన శాఖకు, రజత్ కుమార్ నీటిపారుదల శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
Read also: Asaduddin Owaisi: ముస్లింలకు అనుమతి ఇవ్వడానికి ఆయన ఎవరు..? మోహన్ భగవత్ వ్యాఖ్యలపై అసద్
రామకృష్ణారావు ఆర్థిక శాఖను, అరవింద్‌కుమార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను నిర్వహిస్తున్నారు. రాణి కుమిడిని పదవీకాలం జూన్‌తో ముగియనుంది. శాంతికుమారి ఏప్రిల్ 2025 వరకు ఉంటారు. సునీల్ శర్మ మే 2024 వరకు కాగా.. రజత్ కుమార్ ఈ ఏడాది నవంబర్ వరకు పదవిలో ఉంటారు. రామకృష్ణారావు 2025 ఆగస్టు వరకు, అరవింద్ కుమార్ ఫిబ్రవరి 2026 వరకు పదవిలో ఉంటారు. ఇక సీఎస్ రేసులో రామకృష్ణారావు, అరవింద్ కుమార్ పేర్లు బలంగా ఉన్నాయి. రజత్‌కుమార్, సునీల్ శర్మ, శాంతికుమారి పేర్లు కూడా ప్రచారంలో ఉంది. వారందరిలో తెలంగాణ నుంచి వచ్చిన ఏకైక అధికారి రామకృష్ణారావు. తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ముఖ్యమంత్రి అన్ని అంశాలను పరిశీలించి కొత్త సీఎస్‌ను నియమించనున్నారు. కొత్త సీఎస్ నియామకంతో పాటు ప్రస్తుతం సోమేశ్ కుమార్ నిర్వహిస్తున్న రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, సీసీఎల్ఏ, గనుల శాఖల బాధ్యతలను కూడా ఇతర అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. మరి వీరిలో కొత్త సీఎస్ ఎవరన్నది? ఎవరిని తెలంగాణ సీఎస్ గా సీఎం కేసీఆర్ ఫైనల్ చేస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
Ranji Trophy: ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన పృథ్వీ షా.. టీమిండియాలోకి వచ్చేస్తాడా?