పీఆర్సీ సాధన సమితి, ఏపీ ప్రభుత్వం మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది.. పీఆర్సీ విషయంలో వెనక్కి తగ్గేదేలేదంటున్నారు నేతలు.. చర్చలకు వెళ్లడానికి కూడా షరతులు పెడుతున్నారు.. ఈ నేపథ్యంలో.. సంచలన కామెంట్లు చేశారు పీఆర్సీ సాధన సమితి నేతలు… ఐఏఎస్‌లపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు.. మేం ఈ నెల 25వ తేదీన సంప్రదింపుల కమిటీతో మా స్టీరింగ్ కమిటీ సభ్యులు చర్చలకు వెళ్లి మా లేఖను ఇచ్చి వచ్చామని.. మేం పెద్ద కొర్కేలేమీ అడగలేదన్నారు పీఆర్సీ…
కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థల తీరును కేసీఆర్ తప్పు పట్టారని, కానీ ఐఏఎస్ ఐపీఎస్‌ల వ్యవస్థను కేసీఆర్ ధ్వంసం చేసిన చరిత్ర కేసీఆర్‌కే దక్కుతుందని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం తప్పేనని ఉత్తమ్ అన్నారు. 14 మంది ఐఏఎస్‌లను తప్పించి.. వేరే రాష్ట్రానికి చెందిన వాళ్లను సీఎస్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.…
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం నుండి కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వెళ్లనున్న ఐపీఎస్ అధికారులు. వీరితో ఢిల్లీ నుంచి చీఫ్‌ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర వర్చువల్ బ్రీఫింగ్ ద్వారా మాట్లాడారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్,మణిపూర్, గోవా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం చేయాల్సిన విధులను వీరికి వివరించారు. Read Also: ఏపీలో కొత్తగా 4,528 కరోనా కేసులు ఏపీ నుంచి కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళనున్న 35…
హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐఏఎస్ అధికారులను బడి బాట పట్టించనుంది. ఇక నుంచి హిమచల్ ప్రదేశ్ అధికారులంతా సర్కారు బడికెళ్లి పాఠాలు బోధించాలి. తమ అనుభవాలను విద్యార్థులకు బోధించనున్నారు. భవిష్యత్ గురించి సరైన మార్గనిర్దేశనం చేయనున్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, మౌలిక వసతుల పరంగా ఏమైనా లోపాలున్నాయా… ? అని తెలుసుకునేందుకు హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దీన్లో భాగంగా అఖిల భారత సర్వీసు(ఐఏఎస్)…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఊరట లభించింది… ఈనెల 2వ తేదీన ఐదుగురు ఐఏఎస్‌లకు శిక్ష విధిస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పు ఇచ్చారు.. అయితే.. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేవాలను నిలిపివేసింది డివిజన్ బెంచ్.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్, ఐఏఎస్ అధికారి ముత్యాల రాజు, శేషగిరి బాబు, కెవీఎన్ చంద్రధర్ బాబు వేసిన అప్పీల్‌ను స్వీకరించిన హైకోర్టు.. భూ పరిహారం పూర్తిగా అప్పటికే చెల్లించడంతో పాటు తమవంతుగా…
తెలంగాణలో కొందరు ఐఏఎస్‌ల పరిస్థితి విచిత్రంగా తయారైంది. ట్రాన్స్‌ఫర్ అవుతారు కానీ.. పోస్టింగ్ ఉండదు. ఏడెనిమిది నెలలుగా ఇదే దుస్థితి. కలెక్టర్లుగా బిజీగా పనిచేసిన వారు రోజుల తరబడి వర్క్ లేకుండా ఖాళీగా ఉంటున్నారు. అలాంటి ఆఫీసర్లపై అధికారవర్గాల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. కలెక్టర్లుగా పనిచేసిన వారికి ఏడెనిమిది నెలలుగా పోస్టింగ్ లేదు సాధారణంగా ఒక IASను ఒక పోస్ట్ నుండి బదిలీ చేస్తే మరోచోట పోస్టింగ్ ఇస్తుంది ప్రభుత్వం. ఒకవేళ ఆ టైమ్‌లో కొత్తచోట అడ్జస్ట్…
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం… మొత్తం 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. వీరిలో కలెక్టర్లు.. పెద్ద సంఖ్యలో జాయింట్ కలెక్టర్లు ఉన్నారు.. ఇక, ఇవాళ ఏపీ సర్కార్ బదిలీ చేసిన ఐఏఎస్ అధికారుల వివరాలు పరిశీలిస్తే.. శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ బదిలీ.. ఆయన స్థానంలో ఎల్.ఎస్.బాలాజీరావు నియామకం అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ.. ఆయన స్థానంలో నాగలక్ష్మి…
ఏపీలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.భాస్కర్ ను కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంతే కాదు టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా అదనపు బాధ్యత ఇసస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టీడీసీ ఎం.డిగా బాధ్యతలు చూస్తున్న ప్రవీణ్ కుమార్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది ప్రభుత్వం. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారి ఎస్. సత్యనారాయణకు ఏపీటీడీసీ…