తెలుగు ఫిలిం ఛాంబర్ కి ఒక ఆసక్తికరమైన విజ్ఞప్తి వచ్చింది. అదేంటంటే తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్లు కొత్తగా ఒక మినీ థియేటర్ కట్టించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి ఫిలిం ఛాంబర్ కి ఒక విజ్ఞప్తి వచ్చింది. అదేంటంటే తమ కోసం కొత్త సినిమాలను ఫ్రీగా ఆ మినీ థియేటర్లో వేయాలని కోరారు. సాధారణంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా కలిసి సంబరాలు చేసుకుంటూ, పలు కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంటారు. అలా ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం తాజాగా 48 సీట్ల కెపాసిటీ గల ఒక మినీ థియేటర్ నిర్మించుకుంది.
Lucky Bhaskar : ఓటీటీలోనూ దూసుకుపోతున్న లక్కీ భాస్కర్..
ఈ నేపథ్యంలో తమ కోసం వారాంతాల్లో కొత్త సినిమాలను ఫ్రీగా ప్రదర్శించాల్సిందిగా ఫిలిం ఛాంబర్ దృష్టికి తీసుకు వచ్చింది. ఈ విజ్ఞప్తికి ఫిలిం ఛాంబర్ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిని బట్టి చూస్తే బ్యూరోక్రాట్లకు బ్యూరోక్రాట్ల కుటుంబ సభ్యులకు ఫ్రీగా ఫిలిం ఛాంబర్ కొత్త సినిమాలను ప్రదర్శింప చేసే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది.