Bhatti Vikramarka : తెలంగాణ గౌరవాన్ని దేశ స్థాయిలో నిలబెట్టేందుకు యువత కృషి చేయాలని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్రానికి బలమైన మానవ వనరులు (Human Resource) అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సివిల్స్ – 2025 మెయిన్స్ కు ఎంపికైన 178 మంది అభ్యర్థులకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సివిల్స్ – 2024 విజేతలకు సన్మాన కార్యక్రమం కూడా జరిగింది.
Minister Anitha: బాబాయ్‌ను చంపిన వారికి ఓటు వేయాలా..?
ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐఏఎస్ అధికారుల సేవలు సమాజాభివృద్ధికి ఉపయోగపడాలని సూచించారు. తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు మెయిన్స్‌లో విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. “నిబద్ధతతో పనిచేసే వ్యక్తులు చరిత్రలో నిలుస్తారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరతాయి. పేదల జీవితాల్లో మార్పులకు కారణమవుతేనే మన జీవితానికి సార్థకత ఉంటుంది. మీ ముందున్న ప్రతి సవాల్ సమాజాభివృద్ధి కోసం ఉండాలి” అని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
Nidhhi Agerwal: తెలుగు హీరోయిన్‌కి ప్రభుత్వ వాహనం.. అసలు నిజం ఇదే!