రాష్టాన్ని బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను నాశనం చేసింది, ద్రోహం చేసింది, దోచుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అలా చేయడం తగదని మంత్రి ఉత్తమ్ సూచించారు. �