ఆన్‌లైన్‌లో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల సేవలు నిలిపివేత భవన నిర్మాణాలు, లేఅవుట్లకు ఆన్ లైన్‌లో అనుమతులు జారీ చేసే పోర్టల్‌లో మార్పులు చేస్తోంది ప్రభుత్వం. ఈ మార్పుల్లో భాగంగా పలు రోజుల పాటు ఆన్‌లైన్ అనుమతుల సేవలు నిలిపివేస్తున్నట్లు పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత ఒక ప్రకటనలో తెలిపారు. సర్వర్ మైగ్రేషన్, డేటా మైగ్రేషన్‌లో భాగంగా వచ్చే నెల నాలుగో తేదీ వరకూ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. ప్రస్తుతం భవనాల నిర్మాణాలు, లేఅవుట్లకు…
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నగరంలో చెరువులను, కాలువలను, ఫుట్‌పాత్‌లను, ప్రభుత్వ స్థలాలను కాపాడుతూ.. నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన హైడ్రాకు నేటితో వందరోజులు పూర్తి చేసుకుందని ఆయన తెలిపారు.
చెరువులు, నాలాల పరిరక్షణతో పాటు వాటికి పునరుజ్జీవనం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, లేక్‌మ్యాన్స్, జలవనరుల అభివృద్ధికి సంబంధించిన పలువురు పరిశోధకులు, నిపుణలతో హైడ్రా సమావేశాలు నిర్వహించింది. గురువారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో వాటర్-ఉమెన్ రైట్స్ యాక్టవిస్టు డా. మన్సీబాల్ భార్గవతో హైడ్రా బృందం సమావేశమైంది.
నగర పరిధిలోని చెరువల ఆక్రమణలను తొలగించిన హైడ్రా ఇప్పుడు.. ఆయా చెరువుల పునరుజ్జీవనంపై దృష్టి సారించింది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతీనగర్‌కు చేరువలో ఉన్న ఎర్రకుంట చెరువుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు.
విద్యార్థినిపై దాడి కలచివేసింది.. కడప ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు కడప జిల్లా బద్వేల్‌లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎంతగానో కలచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడం విచారకరమని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా అధికారులు తెలిపారని…
ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం 26వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈ నెల 26న సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని తెలిపారు.
Revanth Reddy: హైడ్రా పనులకు ఎవరు అడ్డు వచ్చిన అక్రమార్కుల సంగతి ఖచ్చితంగా తేల్చుడే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయాలని కొంతమంది ఆర్థిక ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Gutha Sukender Reddy: మూసీ పై కేటీఆర్ చేసిన ట్విట్ కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మనం చేస్తే సుందరీకరణ.. అవతలి వారు చేస్తే వేరేదా? అని ప్రశ్నించారు.