హరీష్.. కేటీఆర్.. ఈటెలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మూడు నెలలు.. పేదలు కాళీ చేసిన ఇండ్లలో ఉండాలని.. కిరాయి తానే కడతానన్నారు. మూడు నెలలు అక్కడే ఉండి రాజకీయం చేయాలన్నారు.
మూసి పరివాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం పని చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మూసి పరివాహక ప్రాంతం ప్రజలను ఆదుకోవడం ఎలా అనే దానిపై దృష్టి సారించారన్నారు.
ఈ నెల 23వ తేదీన సాయంత్రం 4 గంలకు కేబినెట్ సమావేశం జరగనున్నట్లు సమాచారం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, హైడ్రా ఆర్డినెన్సుకు చట్ట బద్ధత, రెవెన్యూ చట్టం, మూసీ బాధితులకు న్యాయం చేసే అంశం, వరద నష్టం, రైతు భరోసా పై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించనుంది.
KTR: నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూలగొడుతున్నారని నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. అదేవిధంగా.. మూసీ పేరుతో లూటీ చేస్తున్నారని, మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదని పేర్కొన్నారు. నాచారం, ఉప్పల్ లో మేమే మూసీ సివరేజ్ ప్లాంట్స్ ఏర్పాటు చేశామని, సివరేజ్ ప్లాంట్స్ పూర్తయితే మూసీ దిగువన శుద్ధి చేసిన నీళ్లే వెళతాయని ఆయన పేర్కొన్నారు. Also Read: Eatala Rajendar: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకరించేందుకు…
HMDA Website: హైదరాబాద్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా హడల్ కనిపిస్తోంది. హైదరాబాద్‌లో చాలా వరకు చెరువులు, కాల్వలు, అప్రోచ్ కాల్వలను రియల్టర్లు లేఅవుట్‌లుగా మార్చి విక్రయిస్తున్నారు.
లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఆనంద్ మల్లిగవాడ్‌తో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వీడియో సమావేశం నిర్వహించారు. నేరుగా హైడ్రా కార్యాలయం నుంచి బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ జరిగిన తీరును కమిషనర్ పరిశీలించారు. మురుగుతో నీళ్లు లేకుండా ఉన్న వాటిని ఎలా మంచినీటి చెరువులుగా తీర్చి దిద్దారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆనంద్ వివరించారు.
హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి, బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 90 స్థానాల్లో 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 37 స్థానాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే, ఈ ఓటమిపై కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఇండియా కూటమి పార్టీలు హస్తం పార్టీపై విరుచుకుపడుతున్నాయి. అహంకారం, అతివిశ్వాసమే కాంగ్రెస్‌ని దెబ్బతీసిందని ఉద్దవ్ ఠాక్రే శివసేన ఆరోపించింది. టీఎంసీ…
డిజాస్టర్ మేనేజ్మెంట్పై హైడ్రా కమిషనర్ సమీక్ష నిర్వహించారు. నగరంలో వరదలు, కారణాలు, ఉపశమన చర్యలు (డిజాస్టర్ మేనేజ్మెంట్)పై బుధవారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్ష చేశారు. బెంగళూరులో అనుసరిస్తున్న విధానాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కర్ణాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కేంద్రం మాజీ డైరెక్టర్ డా. జీఎస్ శ్రీనివాస్ రెడ్డి వివరించారు. బెంగళూరుతో పాటు.. దేశంలోని ఇతర పట్టణాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సమన్వయంతో మెరుగైన వ్యవస్థను రూపొందించడంపై కసరత్తు…
గొలుసుకట్టు చెరువులకు ప్రసిద్ధి చెందిన నగరంలో అస్సలు ఎన్ని చెరువులుండేవి.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లెక్కతేల్చేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి హైడ్రా పని చేస్తోంది. హబ్సిగూడలో ఉన్న సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి మంగళవారం తన అధికారుల బృందంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెళ్లారు. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే డేబబ్రత పాలిట్‌తో పాటు ఇతర అధికారులతో హైడ్రా ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్వే ఆఫ్…
చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నగరంలో చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సోమవారం హైడ్రా కమిషనర్ ,లేక్ ప్రొటక్షన్ కమిటీ ఛైర్మెన్ ఏవీ రంగనాథ్ సమీక్ష నిర్వహించారు. నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు,…