హైడ్రా కు సంబంధించి హై కోర్టు, సుప్రీంకోర్టు ఉందని, కస్టోడీయన్‌గా ప్రభుత్వం కూడా ఆస్తులకు రక్షణ గా ఉండి కాపాడుతుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. వ్యక్తుల ఆస్తులను కూల్చడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అదనపు ప్రయోజనంఏమి లేదని, ఎవరికైనా అలాంటి నష్టం జరిగితే కింది స్థాయి నుండి ప్రిన్సుపల్ సెక్రెటరీ వరకు ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దాంట్లో ఎలాంటి నష్టం జరగదనేది ప్రభుత్వం తరుపున కాంగ్రెస్ పార్టీ…
ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. చెరువులు, నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యమని వెల్లడించారు. ఆర్టికల్ 21 ప్రకారం.. పరిశుభ్రమైన వాతావరణం రైట్ టూ లైఫ్ ఉద్దేశమన్నారు. హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎసెట్ ప్రొటెస్ట్ ఉద్దేశ్యం.. వాటి పరిరక్షణ మా బాధ్యత అని పేర్కొన్నారు. నదులు, చెరువులు, నాలాలు ప్రజల ఆస్తులేనన్నారు. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు.
ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు, చెరువుల కాపాడడం కోసం హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో హైడ్రా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన కట్టడాలను కూల్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. పత్రికలలో, మీడియాలలో కూల్చివేతలపై వస్తున్న వార్తాలపై ఆందోళన వ్యక్తం అవుతోందన్నారు. మూసీ ప్రక్షాళన పై ప్రభుత్వ లక్ష్యంను సవివరంగా చెప్పాలనే ఉద్దేశ్యంతోనే మీడియా ముందుకు వచ్చామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో కలిసి…
KTR Tweet: హైడ్రా బాధితులకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాధితుల పక్షాన పోరాడతామని చెప్పారు.
Hydra Commissioner Ranganath: హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఓ మహిళ బలవనర్మణానికి పాల్పడింది హైడ్రా వల్లే అనే కథనాల నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు.
మూసీ బఫర్ జోన్, FTL ను ఎక్కడ ముట్టుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూసీ ప్రజలకు 10వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని కేటీఆర్ అనాడు ప్రకటించారని, అధికారంలో ఒకేలా! అధికారం కోల్పోతే మరోలా మేము మాట్లాడమన్నారు. మూసీ రివర్ బెడ్ నివాసాల సర్వే జరుగుతుంది…అక్రమ కట్టడాలు అయినా వాళ్లకు మునరావాసం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు రింగ్ రోడ్డు 7వేల కోట్లకు అమ్ముకున్నది గత BRS కాదా!…
హైడ్రామా కమిషనర్ రంగనాథ్ను కోర్టుకు హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆదేశాలు అందాయి. ఇటీవల అమీన్పూర్లో హైడ్రా సంస్థ భవనాన్ని కూల్చివేసిన ఘటనపై కోర్టులో ఆందోళనలు వెల్లువెత్తడంతో వ్యాజ్యం ఉన్న భవనాన్ని ఎలా కూల్చివేశారని హైకోర్టు ఆరా తీసింది. హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా లేదా లిఖితపూర్వకంగా స్పందించాలని కోర్టు ఆదేశించింది. ఈ పరిణామం హైడ్రా చర్యలపై న్యాయస్థానం యొక్క నిశిత పర్యవేక్షణను , చట్ట నియమాన్ని…
హైడ్రా లక్ష్యం సంచులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సమకూర్చడమే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ప్రజల దృష్టిమరల్చడానికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచ్చిందని, ఉన్నఫలంగా నిరాశ్రయులను చేయడం ఎంత వరకు న్యాయమని ఆమె మండిపడ్డారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం బెంబేలెత్తిస్తోందని, హైదరాబాద్ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు డీకే అరుణ. హైదరాబాద్ రావాలంటే పెట్టుబడి దారులు భయపడాల్సిన పరిస్థితి అని, కేసీఆర్ కు మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందన్నారు…
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. హైడ్రా దూకుడు పేదలపై కాకుండా బాధితులతో చర్చించండని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇతర భాగస్వామ్య పక్షాలను పరిగణలో తీసుకోండని, 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లు అక్రమమని సర్కార్ కూల్చివేస్తే వారి బాధ ఎవరికి చెప్పుకోవాలన్నారు కిషన్ రెడ్డి. అక్రమంగా భూములు అమ్మినవారినీ బాధ్యులను చేయాలి, వారి పై చర్యలు తీసుకోవాలని, రాత్రికి రాత్రి కట్టుబట్టలతో రోడ్డునపడేస్తే వాళ్ల బతుకులు ఏమై పోతాయన్నారు. పాలకుల,…