HYDRA Demolition: మూసీ నది వైపు హైడ్రా బుల్‌డోజర్లు దూసుకెళ్లనున్నాయి. ఈ వీకెండ్ లో మూసి రివర్ ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే శని, ఆదివారాల్లో భారీగా మూసి ఆక్రమణల కూల్చివేతలు కొనసాగించనుంది.
మూసీ ఒడ్డున కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ షురూ చేసింది. యాక్షన్ ప్లాన్ పై సెక్రటేరియట్‌లో MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి పలువురు అధికారులు భేటీ అయ్యారు. మూసీపై 13వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మూసీ నివాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
హైడ్రా ఇప్పటివరకు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, నాలాల పైన దృష్టి పెట్టింది. మొదటి సారి రంగారెడ్డి జిల్లా ఔటర్ బయట ఉన్న రూరల్ ప్రాంతంలోని చెరువులు, నాలాలను హైడ్రా బృందం పరిశీలించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని మసాబ్ చెరువు, పెద్ద చెరువుల పరిధిలోని నాలాలను హైడ్రా సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటించింది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పరిధిలోని ఉప్పరిగూడ, పోచారం గ్రామాల్లోని బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ను…
MLA Madhavaram: ప్రజలను సంక్షేమ పథకాల నుండి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు మొదలు పెట్టారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమీన్ పూర్‌లో చీకట్లో కూడా ఆగకుండా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కృష్ణారెడిపేటలో లైట్ల వెలుతురులో అక్రమ నిర్మాణాలను బాహుబలి మిషన్ కూల్చివేస్తోంది. అక్రమ నిర్మాణాన్ని ఆనుకుని ప్రక్కనే మరొక అపార్ట్మెంట్ ఉంది. అయితే.. ఆ అపార్ట్మెంట్ కు ఇబ్బంది కలుగకుండా కూల్చే ప్రయత్నం చేస్తున్నారు హైడ్రా అధికారులు.. పూర్తి నిర్మాణాలు కూల్చే వరకు హైడ్రా యాక్టివిటీ కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పటేల్ గుడా లో చివరి దశ…
అధ్యక్ష తరహా పాలన కోసమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక.. విజయవాడలో నిర్వహిస్తున్న కామ్రేడ్ ఏచూరి సీతారం సంతాప సభలో ఎంఏ బేబీ, బీవీ రాఘవులు, రామకృష్ణ, మాజీమంత్రి అంబటి రాంబాబు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఖర్చులు తగ్గడం కోసమట.. ప్రజాస్వామ్యం పోయినా పర్లేదా అని ప్రశ్నించారు. ఖర్చు కోసం ప్రాణాలు…
ఈ రోజు చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వివరాల ప్రెస్ నోట్ విడుదల చేశారు. కూకట్ పల్లిలోని నల్లచెరువు సర్వే నెం. 66, 67, 68, 69లోని అనధికారికంగా నిర్మించిన షెడ్లను కూల్చివేశామన్నారు. 16 కమర్షియల్ షెడ్లు, ప్రహారి గోడల కూల్చివేత కూకట్ పల్లి నల్లచెరువు పరిధిలో 4 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు సర్వే నెం.164లో మూడు భవనాలు కూల్చివేసినట్లు, వాణిజ్య…
హైదరాబాద్ నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా. అయితే.. మూసీ పరీవాహక ప్రాంతంలో రేపటి నుంచి కూల్చివేతలు జరుగనున్నాయి. మూసీ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది. అయితే.. మూసీ పరీవాహక నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయించనుంది. ఇప్పటికే మూసీ ఆక్రమణలపై సర్వే నిర్వహించారు అధికారులు. మూసీ నదిలో…