కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో హైదరాబాద్‌లో13, వరంగల్ అర్బన్‌లో ఒక స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. 2020లో 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు జరిగాయి. కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల విభజన, ప్రాంతాలు, బదలాయింపు పనులన్నీ ప్రస్తుతం పూర్తయ్యాయి. READ MORE: Delimitation: జనాభా నియంత్రణ…
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిగ్ షాక్ ఇచ్చింది. శంషాబాద్‌లోని ఎయిర్పోర్ట్ సిటీలో ఉన్న అమెజాన్ గోదాంపై సోదాలు నిర్వహించింది. బిఐఎస్ చట్టం, 2016 నిబంధనలను ఉల్లంఘించినందుకు హైదరాబాద్ శాఖ అధికారులు సోదాలు, సీజ్ ఆపరేషన్ నిర్వహించారు. డైరెక్టర్ & హెడ్ శ్రీ పి వి శ్రీకాంత్ ఆదేశాల మేరకు.. జాయింట్ డైరెక్టర్ రాకేష్ తన్నీరు నేతృత్వంలో, SPO అభిసాయి ఎట్టా డిప్యూటీ డైరెక్టర్ కవిన్ కె, JSA శివాజీలతో…
ఐపీఎల్ జోష్ మరింత కిక్కిచ్చేలా క్రికెట్ లవర్స్ కోసం టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాదులో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ప్రేక్షకుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తుంది.. ఐపీఎల్ కు వచ్చే ఫ్యాన్స్ కి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులను వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ఆపరేట్ చేయనున్నట్టు వెల్లడించారు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసి అధికారులు. గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 స్పెషల్…
గంజాయి.. సమాజాన్ని పట్టిపీడిస్తున్న భూతం. గంజాయి నిర్మూళనకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం గంజాయి రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల ధూల్ పేట గంజాయి డాన్ అంగూర్ బాయి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఒరిస్సా గంజాయి లేడీ డాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో ఐదు కేసుల్లో నిందితురాలిగా ఉన్న…
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ తో మంగళగిరికి చెందిన బీటెక్ చదివిన శ్రీవర్షిణి అనే యువతి వెళ్లిపోవటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అటు హైదారబాద్ లో ఉన్న వనస్థలిపురంలో, గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీవర్షిని తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశాడు.
BRS MLCs Protest: శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన వ్యక్తం చేసింది. హామీల అమలు కోసం వినూత్న తరహాలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తుంది. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని వినూత్నంగా కారు పార్టీ ఎమ్మెల్సీల నిరసన చేశారు.
మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారట.. హైదరాబాద్‌లో ఉన్న కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు.. ఛాతిలో నొప్పిరావడంతో.. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు మేడ్చెల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ గా గుర్తించారు. పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్ లో నిందితుడు ఎక్కడ ఎక్కాడో వివరాలు సేకరిస్తున్నారు. అల్వాల్ రైల్వే స్టేషన్ లో ఎక్కినట్లు అనుమానిస్తున్నారు. అల్వాల్ రైల్వే స్టేషన్ లో సీసీ కెమరాల్లో నిందితుడు కనిపించలేదు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బైక్ రేసర్ బీర్ బాటిల్‌తో కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. టోలిచౌకి నుండి వేగంగా వస్తున్న ఖాజా అనే బైక్ రేసర్ ఓ కారును ఢీకొట్టాడు. ఈ ఘటన బంజారాహిల్స్ ఒమేగా హాస్పిటల్స్ రోడ్డులో చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం కార్ డ్రైవర్, ఖాజా మధ్య వాగ్వాదం తలెత్తింది. అప్పుడే కానిస్టేబుల్ శ్రీకాంత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విధుల కోసం వెళ్తున్నాడు. ఈ ఘర్షణను గమనించిన కానిస్టేబుల్ శ్రీకాంత్ వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు.
హైదరాబాద్‌లోని బాలనగర్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు సంచలనం రేపింది. మద్యం మత్తులో ఓ యువకుడు ఫార్చునర్ కారుతో యువతిని బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో 19 ఏళ్ల యువతి సాయి కీర్తి తీవ్రంగా గాయపడింది. ఈ రోజు ఉదయం బాలనగర్ ఐడీపీఎల్ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. ఫార్చునర్ కారులో అతివేగంగా ప్రయాణిస్తున్న యువకుడు మద్యం మత్తులో ఉండటంతో అదుపుతప్పి రోడ్డుపై నడుస్తున్న సాయి కీర్తిని ఢీకొట్టాడు.