గత కొన్ని నెలలుగా లేడీ అఘోరి వ్యవహారం హాట్ టాపిక్ గానే ఉంటోంది. సనాతన ధర్మం, దేశ రక్షణ, మహిళల రక్షణ కోసం పాటుపడుతున్నానంటూ.. తనపై ఎదురుతిరిగిన వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తూ హల్ చల్ చేస్తోంది. తాజాగా లేడీ అఘోరీకి సంబంధించిన మోసం వెలుగుచూసింది. అఘోరీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా అఘోరీపై కేసు నమోదైంది. సైబరాబాద్ మొకిలా పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 25 న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యోని పూజ చేస్తానని మోసం చేసినట్లు పిర్యాదులో పేర్కొంది. యోని పూజలు చేస్తానని.. 9.8 లక్షలు తీసుకొని తనను మోసం చేసినట్లు మహిళ ఆరోపించింది.
Also Read:Minister Narayana: రాజధాని నిర్మాణంలో 3 వేల మంది కార్మికులు, 500 మెషీన్లు!
రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, ప్రొద్దుటూర్ మండలానికి చెందిన లేడీ ప్రొడ్యూసర్ లేడీ అఘోరీ శివ విష్ణు బ్రహ్మ అట్లూరి మోసాలను బయటపెట్టింది. లేడీ అఘోరీతో 6 నెలల క్రితం పరిచయం అయినట్లు తెలిపింది. పరిచయం అయిన 2 నెలల తర్వాత ప్రొద్దటూర్ లోని ప్రగతి రిసార్ట్స్ కు డిన్నర్ కు వచ్చిందని వెల్లడించింది. అప్పటి నుంచి తరచుగా ఫోన్ చేస్తూ వ్యక్తిగత విషయాలను తెలుసుకునేదని తెలిపింది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించిందని ఆ మహిళా ప్రొడ్యూసర్ వెల్లడించింది. లేడీ అఘోరీ మాటలు నమ్మి పూజకు అంగీకరించానని తెలిపింది.
Also Read:Odela2 : ఓదెల-3 ఉంటుందా.. సంపత్ నంది క్లారిటీ..
వారం రోజుల్లో పూజ చేద్దామని అందుకు ఖర్చుల కోసం రూ. 5 లక్షలు లేడీ అఘోరీ అకౌంట్ లో వేశానని తెలిపింది. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలోని ఫాం హౌస్ లోకి తీసుకెళ్లి పూజ చేసిందని తెలిపింది. మరుసటి రోజు మరో రూ. 5 లక్షలు తన అకౌంట్ లో వేయాలని లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరి భయపెట్టిందని చెప్పింది. అఘోరి మాటలకు భయపడిపోయి రూ. 5 లక్షలు అకౌంట్ లో వేశానని ఇలా మొత్తం రూ. 10 లక్షలు ముట్టజెప్పానని పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. దీన్ని అలుసుగా చేసుకుని అఘోరి మాతతో పూజ పూర్తి చేసుకున్నావు కనుక ఇంకా రూ. 5 లక్షలు ఇవ్వాలని లేదంటే నిన్ను, కుటుంబ సభ్యులను మంత్ర శక్తులతో అంతమొందిస్తానని.. బెదిరింపులకు పాల్పడ్డట్లు కంప్లైంట్ లో పేర్కొంది.