హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది… ఈ ఉత్సవాల్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక పాత్ర పోషిస్తోంది.. కరోనా మహమ్మారి కారణంగా.. గత ఏడాది ఉత్సవాలు కళ తప్పాయి.. ఈసారి కూడా అప్పటి వరకు కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయోననే టెన్షన్ కొనసాగుతూనే ఉంది.. ఈ ఏడాది 10 సెప్టెంబర్న గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయని.. 19వ తేదీన గణేష్ నిమజ్జనం ఉంటుందని వెల్లడించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ…
కోకాపేట్, ఖానామెట్ భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది.. కనక వర్షమే కురిసింది.. అయితే, ఖానామెట్ భూముల వేలంపై కీలక ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు.. ఖానామెట్‌లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది. ఖనామెట్‌లో గొల్డెన్ మైల్‌లోని 15 ఎకరాలను వేలం వేశారు.. అయితే, 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం కూడా ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టగా.. ఆ స్మశానవాటిక వేలాన్ని ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించారు స్థానికులు……
పెట్రో ధరలు వరుసగా పెరిగిపోతూనే ఉన్నాయి… పెట్రో భారం ప్రత్యక్ష, పరోక్షంగా ప్రజల నడ్డి విరిస్తూనే ఉంది.. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు పెంచేశాయి.. దీంతో.. ఢిల్లీలో లీటర్ ప్రెటోల్ ధర రూ.101.84కి చేరగా.. డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో లీటర్ డీజిల్ ధర రూ.89.87గా ఉంది.. 75 రోజుల్లో 41వ సారి పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. ఢిల్లీ, ముంబై, చెన్నై,…
మూడు రోజుల క్రితం వరకూ స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇప్పుడు తిరిగి పెరగడం మొదలు పెట్టాయి. ఈ రోజు కూడా ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ.45,250కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి 49,370 కి చేరింది. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండటంతో బంగారం…
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్రం గెజిట్లు విడుదల చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. ఇక, త్వరలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. నీటా వాటాల విషయంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్.. సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదని ఎంపీలకు స్పష్టం చేశారు కేసీఆర్. లోక్ సభ, రాజ్యసభల్లో, సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాటాకోసం కేంద్రాన్ని నిలదీయాలని, గట్టిగా కొట్లాడాలని…
కరోనా మహమ్మారి విజృంభణతో రైళ్లు పూర్తిగా నిలిచిపోయాయి… ప్రత్యేక రైళ్లు, ఆక్సిజన్ కోసం రైళ్లు తప్పితే.. సాధారణ రైళ్లు పట్టాలెక్కింది లేదు.. కానీ, రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పేసింది దక్షిణ మధ్య రైల్వే.. 82 రైళ్లను పునరుద్దరించేందుకు సిద్ధమైంది.. 16 రైళ్లు ఎక్స్‌ప్రెస్ కాగా 66 ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 19వ తేదీ నుంచి కొత్త నెంబర్లతో ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.. ప్యాసింజర్ రైలులో ప్రయాణానికి స్టేషన్లోనే టికెట్లు ఇవ్వనున్నారు అధికారులు… ఇక ఈ…
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచింది.. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని కోరుతూ ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కోరింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీలు ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలిసి.. ఈ మేరకు విజ్ఞప్త చేశారు.. అయితే, వారి వినతిపై సీఎం సానుకూలంగా…
మహిళల భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. మహిళలు, చిన్నారుల నేరాలపై పరిశోధనకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక సైబర్ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. సైబర్ నేరాలను నివారించేందుకు గాను రాష్ట్ర పోలీసు శాఖలో ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్ ల్యాబ్ పై మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి స్వాతిలక్రా, సైబర్ ఇంటలీజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్…
భూముల వేలం తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది… నిన్న కోకాపేటలో రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం రాగా.. ఇవాళ సైబరాబాద్‌లో హైటెక్ సిటీ సమీపంలోని ఖానామెట్‌లోని భూముల వేలానికి విశేష స్పందన లభించింది. ఎంఎస్టీసీ ద్వారా నిర్వహించిన ఈ వేలంలో మొత్తం అయిదు ప్లాట్లను విక్రయించారు. 14.91 ఎకరాలకు గాను రూ. 729.41 కోట్ల ఆదాయం వచ్చినట్టు ప్రకటించారు అధికారులు.. గరిష్టoగా ఎకరానికి రూ.55 కోట్ల ధర పలకగా.. 15 ఎకరాలకు అవరేజ్ గా…