‘లూసిఫర్’ మూవీ తర్వాత మోహన్ లాల్ కథానాయకుడిగా యంగ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ బ్రో డాడీ’. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో మొదలైంది. నిజానికి 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో ఈ మూవీని కేరళలో ప్లాన్ చేశారు. కానీ అక్కడి ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో మూవీ షూటింగ్స్ కు అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో మొత్తం టీమ్…
హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. ఉప్పల్ లో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం పడగా… హయత్ నగర్ లో 19.2 సెంటీమీటర్లు.. సరూర్ నగర్ లో 17.2 సెం. మీ వర్షపాతం నమోదు అయ్యింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి కేటీఆర్ సూచించారు. నీటమునిగిన ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి జిహెచ్ఎంసి డిజాస్టర్ బృందాలు . ఇక హైదరాబాద్ లో బారి వర్షాలు కురవడంతో…
మూడు రోజుల క్రితం వరకూ స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇప్పుడు తిరిగి పెరగడం మొదలు పెట్టాయి. ఈ రోజు ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ.44,900కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి 48,990 కి చేరింది. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండటంతో బంగారం కొనుగోలు…
దేశంలో రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, హైదరాబాద్లో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి నగరంలో భారీ వర్షం కురుస్తున్నది. రాత్రి 11 గంటల నుంచి ఈరోజు ఉదయం 5 గంటల వరకు వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరడంతో…
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది కేబినెట్.. సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని.. అందుకు సరికొత్త పోస్టుల అవసరం…
హైదరాబాద్ లో భారీ వర్షాలకు పురాతన, శిథిలావస్థలో వున్న భవనాలు కుప్పకూలుతున్నాయి. బుధవారం ఓల్డ్ మలక్ పేట్ గంజ్ లోని మహబూబ్ మేన్షన్ ప్యాలెస్ చూస్తుండగానే కుప్పకూలింది. గత నాలుగు రోజులుగా నగరంలో కురుస్తున్న వానలకు ఈ భవనం బాగా నానిపోయింది. చాలా కాలం నుంచి ఈ భవనం పటిష్టతపై అనుమానాలు వస్తూనే వున్నాయి. వర్షాలకు బాగా నానిన భవనం ఒక్కసారిగా కూలిపోయింది. కాగా, తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని…
ఓవైపు ప్రభుత్వ భూముల వేలానికి ప్రభుత్వం సిద్ధమవుతోన్న తరుణంలో.. మరోవైపు.. ఆ భూములు ఎవరూ కొనవద్దు.. హైకోర్టు విచారణ పూర్తి అయ్యేవరకు ఆగాలని సూచిస్తున్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. రేపటి కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరించడంతో భూముల వేలానికి మార్గం సుగమం కాగా.. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల భూముల వేలానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే, భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వానికి హై కోర్టు మొట్టికాయలు…
హైదరాబాద్ లో తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆబిడ్స్ లోని గన్ఫౌండ్రీ ఎస్బీఐ కార్యాలయం ఆవరణలో బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సర్దార్ఖాన్, కాంట్రాక్టు ఉద్యోగి సురేందర్ పై కాల్పులు జరిపాడు. దీంతో సురేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి మధ్య పరస్పర వాగ్వాదంతో విచక్షణ కోల్పోయిన సెక్యూరిటీ గార్డు సర్దార్ ఖాన్ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. సురేందర్ ప్రస్తుతం హైదర్గూడలోని…
మన దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడం తప్ప… తగ్గుదల అసలు కనిపించడంలేదు. పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు కాస్త ఊరట కలిగించాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా నమోదయ్యాయి. తాజా ధరల ప్రకారం… ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 వద్ద కొనసాగుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.72 కు చేరింది.…