ఇప్పటికే తెలంగాణ టీడీపీకి రాజీనామా చేసిన ఎల్. రమణ ఇవాళ కారెక్కారు… తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన రమణ.. ఈ మధ్యే సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు.. కాసేపటి క్రితం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. ఈ సందర్భంగా ఎల్. రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం కేసీఆర్… రమణతో పాటు ఆయన అనుచరులు కూడా గులాబీ గూటికి చేరారు. కాగా, ఇటీవలే…
కరోనా మహమ్మారి కారణంగా చాలా పరీక్షలు రద్దు కాగా.. కొన్ని పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చారు.. ఇక, కామన్ ఎంటెన్స్ టెస్ట్‌లను కూడా పలు దపాలుగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. అన్ని ఎంట్రెన్స్ టెస్ట్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. దీంతో.. వరుసగా కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు జరగబోతున్నాయి. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి… రేపటి నుంచి సెప్టెంబర్ రెండో…
దేశంలో రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఆందోళనలు చెందుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి శ్రేణులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నాచౌక్ నుంచి రాజ్‌భవన్…
కరోనా తరువాత మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో బంగారం కోనుగోలు చేసే వినియోగదారులు పెరిగారు. బంగారానికి డిమాండ్ పెరుగుతున్నది. దీంతో ధరలు పెరగడం మొదలుపెట్టాయి. తాజాగా ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ. 45,150కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి రూ. 49,260కి చేరింది. ఇక బంగారంతో…
కోకాపేట భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది… హెచ్ఎండీఏ భూములు వేలం వేయగా… అధికారులు అంచనా వేసినకంటే ఎక్కువ ధరకు అమ్ముడు పోయాయి.. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్టీసీ వెబ్సైట్ ద్వారా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) వేలం నిర్వహించింది.. ఒక్కో ఎకరం కనీస ధర రూ.25 కోట్లుగా నిర్ధారించగా.. వేలంలో రూ.60 కోట్లు పలకింది.. అత్యధికంగా ఎకరాకు రూ. 60.2 కోట్లు ధర పలకగా.. అత్యల్పంగా ఎకరానికి రూ. 31.2 కోట్లు వెచ్చించారు.. అవరెజిగా ఎకరానికి…
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడంతో లక్షలాది మంది నగర వాసులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్న కేటీఆర్… కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కేటీఆర్ కోరారు. read also : అసత్య ప్రచారం చేస్తే నాలుక…
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. చదువుకున్న వారు సైతం సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. అయితే తాజాగా రూ. 41 లక్షలు మోసం చేసిన సైబర్ నేరస్తున్ని పోలీసులు పట్టుకున్నారు. ఆయుర్వేదిక్ వైద్యురాలిని టార్గెట్ చేసి సైబర్ ఫ్రాడ్స్ కు పాల్పడిన నైజీరియన్ నేరగాన్ని అరెస్ట్ చేశారు. విదేశాలకు హెర్బల్ ముడిపదార్థాల ఎగుమతి పేరుతో వైద్యురాలిని నైజీరియన్ వ్యక్తి మోసం చేశాడు. ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకొని మెహదీపట్నంకి చెందిన ఆయుర్వేద వైద్యురాలు నుంచి…
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగంలో ఇప్పటికే లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు సీఎం కేసీఆర్… నూతన జోన్ల ఆమోదం తర్వాత జోన్లలో క్లారిటీ రావడంతో మరో 50 వేల ఉద్యోగాలకోసం కార్యాచరణ రూపొందించామన్నారు.. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు ఉంటాయని తెలిపారు. ఇక, అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలను తెలంగాణ ప్రజలు దక్కించుకోవడం ఇప్పటికే ప్రారంభమైందన్న ముఖ్యమంత్రి… దండుగన్న వ్యవసాయం నేడు పండుగలా మారడమే అందుకు ఉదాహరణగా…
తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం అప్పుడు ఉద్యమించాం… ఇప్పుడు కేసీఆర్‌ను గద్దె దించేందుకు కార్యకర్తలు ఉద్యమంలా పనిచేయాలంటూ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారానికి చమరగీతం పడాలంటే ప్రతి బీజేపీ కార్యకర్త సైనికుల్లా పనిచేసి, బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషిచేయాలన్నారు.. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర సంపదను దోచుకొని…