కరోనా మహమ్మారి విజృంభణతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి… ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణలో వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి… ఇదే, సమయంలో.. సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. అయితే, మల్టీప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో మాత్రం యాథావిధిగా నో పార్కింగ్ ఫీజు విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో…
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువ, రిజిస్ట్రేషన్ రుసుము పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.. పెంచిన మార్కెట్ విలువలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.. ఇక, వ్యవసాయేతర భూముల విలువను ఇప్పటి కన్నా గరిష్ఠంగా 50 శాతం పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ఈ క్రమంలో సాగుభూములు గరిష్ఠ, కనిష్ఠ విలువల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భూముల…
భారీ వర్షాలతో హిమాయత్‌సాగర్ నిండు కుండలా మారింది.. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1762.90 అడుగులకు చేరింది నీటిమట్టం దీంతో.. దిగువప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. మొదటగా మూడు గేట్లను ఎత్తి దిగువకను నీటిని విడుదల చేస్తున్నారు.. హిమాయత్‌సాగర్‌కు మొత్తం 17 గేట్లు ఉండగా… 5వ నంబర్ గేట్ ను ఎత్తిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. మూసి నదిలోకి నీటిని వదిలారు.. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఇలానే కొనసాగితే మరిన్ని…
నాగోల్ అల్కాపురి లో గల టాటా షో రూమ్ లో మొదటి అంతస్తు నుంచి కారు కిందపడింది. కారును కొనుగోలు చేసింది మేడిపల్లి కి చెందిన భగవత్ అనే వ్యక్తి. మొదటి అంతస్తులో ఉన్న కారును హైడ్రాలిక్ సిస్టం పై కిందికి తీసుకొనివచ్చి కారు కొనుగోలు చేసిన వ్యక్తికి ఇవ్వాలి షోరూమ్ సిబ్బంది. కానీ మొదటి అంతస్తులో ఉన్న కారును భగవత్ నడిపేందుకు షోరూం సిబ్బంది అనుమతి ఇచ్చారు. కారును స్టార్ట్ చేయడం తో హఠాత్తుగా మొదటి…
గత రెండు రోజులుగా పెరుగుతున్న పుత్తడి ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అనుకున్న వినియోగదారులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ధరలు పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 45,000 కి చేరింది. ఇక 10…
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులకు పార్టీలో కీలక పదవులు ఇచ్చే ఆలోచనలో పీసీసీ ఉన్నట్టు తెలుస్తుంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కొన్ని ప్రధానమైన అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణలో ఒక పార్టీ నుండి… ఇంకో పార్టీకి వలసలు సహజమయ్యాయి. అయితే, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారిని కూడా కలుపుకుని పోవాలని రేవంత్ భావిస్తున్నారు. దీంట్లో భాగంగా పార్టీలోకి నాయకులను ఆహ్వానించే పనిలో పడ్డారు. పార్టీలోకి ఎవరిని…
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 746 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… మరో ఐదుగురు మృతిచెందారు.. ఇదే సమయంలో 729 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,37,373కు చేరుకోగా.. ఇప్పటి వరకు 6,23,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. మృతుల సంఖ్య 3,764కు పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.29 శాతంగా…
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్.. నా హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించడం సంచలనంగా మారింది.. నన్ను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడు.. హంతక ముఠాతో చేతులు కలిపారని నాకు సమాచారం వచ్చింది. నన్ను నరహంతకుడు నయీం చంపుతా అంటేనే భయపడలేదు.. ఈ చిల్లర ప్రయత్నాలకు ఏనాడూ కూడా భయపడం.. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని అంటూ ఆయన కామెంట్ చేశారు.. అయితే, ఈటల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి గంగుల కమలాకర్.. ఈటల…
తెలంగాణ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌కు సైబర్ కేటుగాళ్లు కన్నం వేశారు.. బ్యాంక్ ఖాతాల్లోకి ప్రవేశించి దాదాపుగా రూ.2 కోట్లు కాజేశారు.. అయితే, ఈ కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.. బ్యాంక్ మూల ధనం నుంచి రెండు కోట్లు కొట్టివేసిన నైజీరియన్‌ను పట్టుకున్నారు సీసీఎస్ పోలీసులు.. దీంతో అపెక్స్ బ్యాంకులో నగదు మాయం కేసులో అరెస్ట్‌ల సంఖ్య రెండుకు చేరింది.. హైదరాబాద్ టోలిచౌకిలో నివాసముంటున్న నైజీరియన్ లేవి డైలాన్ రోవాన్ ఇవాళ అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు…
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)కు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. వారి వేతనాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ప్రస్తుతం వారి వేతనం నెలకు రూ.15 వేలు ఉండగా.. దానిని రూ.28,719కి పెంచింది నిర్ణయం తీసుకుంది.. ఈ నెల నుంచే పెరిగిన వేతనాలను జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు చెల్లించనుంది సర్కార్.. ఇక, ప్రొబేషన్ పీరియడ్ మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది సర్కార్.. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి ఎం రఘునందర్…