రాజేంద్రనగర్‌లో బాలుడు మృతిపై బిగ్ ట్విస్ట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నాలుగు రోజుల క్రితం రాజేంద్రనగర్ హైదర్‌గూడలో అదృశ్యమైన బాలుడు అనీష్ కుమార్ మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అనీష్ కుమార్ ది ముమ్మాటికి హత్యేనని అంటున్నారు.గురువారం మధ్యాహ్నం అదృశ్యమైన అనీష్ కుమార్ కోసం చుట్టు పక్కల మొత్తం వెతికారు. బాలుడి మృతదేహం లభించిన నీళ్ల కుంట వద్ద కూడా పోలీసులతో ముందు రోజే గాలించారు. అక్కడ బాలుడికి సంబంధించిన ఏలాంటి ఆనవాలు లభించలేదు. కానీ మరుసటి రోజు మృతదేహం నీళ్ల కుంట లోకి ఏలా వచ్చింది? గురువారం గట్టుపై కనిపించని టీ షర్టు శుక్రవారం రోజు ఏలా వచ్చింది? కుటుంబసభ్యుల అనుమానాలకు సమాధానం మాత్రం లభించట్లేదు.
తన మనవడిని ఎవరో పొట్టన పెట్టుకున్నారని అంటున్నారు బాలుడి తాత. చిత్ర హింసలు పెట్టి హత్య చేసారని వాపోయాడు. ముఖం పై గాయాలు ఉన్నాయని.. కన్ను గుడ్డును తీవ్రంగా గాయపర్చారని చెప్పాడు. నోట్లో యాసిడ్ పోసారని ఆరోపిస్తున్నాడు.అపార్ట్‌మెంట్‌లో గత వారం రోజులుగా సీసీ కెమెరాలు పని చేయకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుందంటున్నాడు తండ్రి శివశంకర్. అదృశ్యం అయిన రోజే కొత్త సెక్యూరిటీ గార్డు వచ్చాడని.. అదే రోజు సెక్యూరిటీ గార్డు మారడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. తన కుమారుడి మరణం పై లోతుగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసాడు. పోలీసులు బాలుడి మృతిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. వారి అనుమానాలను పోలీసులు ఎలా నివృత్తి చేస్తారో చూడాలి.
Also Read
- Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?