ఓ వర్గం మహిళలను టార్గెట్ చేస్తూ.. బుల్లి బై పేరుతో ఉన్న ఓ యాప్ విరుచుకుపడుతోంది.. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఈ యాప్ ఆగడాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు.. ఇక, ముంబైలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ముస్లిం మహిళలు సింగిల్‌గా ఉన్న ఫొటోలను తీసుకుని.. వాటిని ఈ యాప్‌లో అమ్మకానికి పెట్టడం.. వాటిని వేలం వేయడమే బుల్లి బై యాప్…
తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. మరోవైపు ఒమిక్రాన్ కూడా టెన్షన్ పెడుతోంది.. ఇక, ఎవ్వరినీ వదిలేదు అనే తరహాలో సామాన్యులు, నేతలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పీఎంలు.. అధికారులు.. ఎవరైతే నాకేంటి అనే విధంగా.. అందరినీ టచ్ చేస్తోంది మాయదారి కరోనా.. తాజాగా, టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. నిర్ధారణ…
కూకట్‌పల్లిలోని శివపార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు కాల్ చేశారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది థియేటర్ వద్దకు చేరుకొని 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రాత్రి సమయం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. థియేటర్లోని సామాగ్రి మొత్తం అగ్నికి అహుతి అయింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్థరాత్రి…
హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్‌కి ఎదురుగా ఉన్న లోటస్ఆస్పత్రిలో అక్రమ బిల్లులుకు తెర తీశారు ఆస్పత్రి సిబ్బంది. కంప్యూటరైజ్డ్ బిల్లు అంటూ అక్రమంగా బిల్లులు వసూలుకు సిద్ధమైన లోటస్ ఆస్పత్రి యాజమాన్యం. ఉదయం 11 గంటల నుంచి డెలివరీ అయిన పేషెంట్‌తో సహ చిన్న బేబీని ఆస్పత్రిలోనే ఉంచి ఇబ్బందిపెడుతున్న ఎల్బీనగర్ లోటస్ యాజమాన్యం. ఇప్పటికే పేషంట్ నుంచి ఒక ఒక లక్షా 31వేల బిల్లు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. Read Also:అధికార అహంకారంతో కేసీఆర్‌కు…
విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. విహారం కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన వారిలో సముద్రంలో గల్లంతు అవ్వడం తోటి వారిని కలిచి వేసింది.విహారం కోసం వచ్చిన వారిలో సముద్రంలో మునిగి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఒడిశాకు చెందిన ఐదుగురు బీచ్‌లో స్నానానికి దిగగా వారిలో సునీత త్రిపాఠి అనే యువతి మృతి చెందింది. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. Read Also: మద్యం సేవించొద్దన్నందుకు వ్యక్తులపై దాడి.. ఒకరు మృతి…
హైదరాబాద్ ఖాజాగూడలోని కరాచీ బేకరీపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. కరాచీ బేకరీలో కొన్న స్వీట్లలో బూజు ఉందంటూ ఓ వ్యక్తి తెలంగాణ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన ఆయన… వెంటనే కరాచీ బేకరీపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించాడు. ఈ క్రమంలో ఖాజాగూడలోని కరాచీ బేకరీలో అధికారులు సోదాలు నిర్వహించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బేకరీ పరిసరాలు, వంట గదిని పరిశీలించారు. బేకరీలోని…
ఏపీ భూములపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో 10 ఎకరాలు అమ్మితే.. తెలంగాణ లో 100 ఎకరాలు కొనేవారని.. ఇప్పుడు రివర్స్ అయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ కల్చర్ క్లబ్‌లోఅల్లూరి సీతారామరాజు 125 వ జయంతి జాతీయ సంబరాలు ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ…
వారం రోజుల క్రితం వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. గత వారం రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ఈ వారంలో కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ వారంలో దాదాపు రూ. 300 నుంచి 400 మేర ధరలు తగ్గాయి. బంగారం బాటలోనే వెండి కూడా తగ్గింది. Read: జనవరి 2, ఆదివారం దినఫలాలు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర వారం రోజుల…
హైదరాబాద్ నగరంలో క్రమంగా ఫ్లైఓవర్ల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో హైదరాబాద్ సిటీ మరింత స్మార్ట్‌గా మారుతోంది. తాజాగా షేక్‌పేటలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్ స్థానికులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన నైట్ విజువల్ ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. లైట్ల వెలుతురులో ఈ ఫ్లై ఓవర్ అద్భుతంగా కనిపిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. Read Also: టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 12 ఏళ్ల లోపు చిన్నారులకు శాశ్వతంగా ఉచిత ప్రయాణం…
నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నరర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఆమె మాట్లాడారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వివిధ విద్యా సంస్థలకు ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. 19 విద్యాసంస్థలలో 30 వేల మంది విద్యార్థులను చదివించడం గొప్ప విషయమని గవర్నర్ అన్నారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే ఆదాయం పేద, మధ్య తరగతి అమ్మాయిల చదువుకు ఉపయోగపడుతుందన్నారు. Read Also:మిఠాయిలు పంచుకున్న భారత్-పాక్ సైనికులు నో మాస్క్, నో ఎంట్రీ రూల్ పాటిస్తున్న…