Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
- తండ్రి పాస్‌పోర్ట్, డబ్బు తీసుకున్నారని పోలీసుల ఫిర్యాదు
- మోనాలిసా సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monalisa: ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మోనాలిసా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. తన తండ్రి తన పాస్‌పోర్ట్, డబ్బు తీసుకున్నారని, తన ప్రాణానికి ప్రమాదం ఉందని ఆరోపిస్తూ ఆమె కేరళలోని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోనాలిసా తన న్యాయవాదితో కలిసి ఆదివారం సాయంత్రం ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి తన పాస్‌పోర్ట్, డబ్బు తీసుకున్నారని, తన ప్రాణానికి ముప్పు ఉందని ఆమె ఆరోపించారు. ఇదిలా ఉండగా.. మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై కిడ్నాప్ ఆరోపణలు ఉన్నాయి. ఆమె మైనర్ అని పేర్కొంటూ మోనాలిసా తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాను మేజర్ అని, తన ఇష్టప్రకారమే ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నానని మోనాలిసా చెబుతున్నట్లు సమాచారం.
గత నెలలో తనకు ప్రాణహాని ఉందంటూ మోనాలిసా కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆమెకు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించింది. అయితే అనంతరం ఆమెను, ఆమె భర్తను సంప్రదించలేకపోతున్నామని పోలీసులు కోర్టుకు వివరించారు. దీంతో భద్రతను ఉపసంహరించుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే మళ్లీ వాళ్లు సంప్రదిస్తే రక్షణ కల్పించవచ్చని స్పష్టం చేసింది. తాజాగా మోనాలిసా మళ్లీ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తదుపరి చర్యలపై కొచ్చి నగర పోలీస్ కమిషనర్‌తో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. కాగా, ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో తన ప్రత్యేకమైన రూపంతో ఆకట్టుకున్న మోనాలిసా ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆ తర్వాత ఆమె ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకోవడం, కుటుంబ వివాదాలు, పోలీసు ఫిర్యాదులతో ఆమె పేరు వరుసగా వార్తల్లో నిలుస్తోంది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు