JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda – CJP Leaders: కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ నాయకుల సమావేశం ముగిసింది. తమ డిమాండ్లను ప్రభుత్వం శ్రద్ధగా విన్నదని, వాటిని పరిశీలిస్తుందనే నమ్మకం ఉందని సీజేపీ నేతలు వెల్లడించారు. సమావేశం ప్రశాంత వాతావరణంలో జరిగిందని, తమ ఆందోళనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీజేపీ ప్రతినిధి బృందం జేపీ నడ్డాను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. అనంతరం వారు మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగా జరిగాయని, ప్రభుత్వం తమ సమస్యలపై త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
సమావేశం తర్వాత తమ మద్దతుదారులకు శాంతిని పాటించాలని సీజేపీ నేతలు కీలక విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలను కాపాడుతూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనకారులను బలవంతంగా తొలగించే ఆలోచన లేదని వర్గాల సమాచారం. ఈ సందర్భంగా వాళ్లు డిమాండ్స్ గురించి మాట్లాడుతూ.. సోనమ్ వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లేదా కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రాణాలు కోల్పోయిన 20 మందికి పైగా నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
మరోవైపు జేపీ నడ్డా కూడా ఈ సమావేశంపై స్పందించారు. ఆదివారం ఉదయం నిరసనకారుల ప్రతినిధులతో చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఉదయం 11:50 గంటలకు మొదలైన చర్చల్లో మొదట మౌఖికంగా సమస్యలను విన్నామని, అనంతరం సాయంత్రం లిఖితపూర్వక వినతిపత్రంపై చర్చించామని పేర్కొన్నారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని తెలిపారు. నిరసనకారులు ఆందోళన విరమించి సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు సహకరించాలని జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అందరి దృష్టి ప్రభుత్వ తదుపరి నిర్ణయంపైనే ఉంది.
आज सुबह पहली बार प्रदर्शनकारियों की ओर से सरकार के साथ बातचीत करने का प्रस्ताव आया और सुबह 11:50 AM से ही हमारी बातचीत जारी है।
सौहार्दपूर्ण वातावरण में मुलाकात हुई। उनके डेलीगेशन के साथ विस्तार से पहले मौखिक चर्चा हुई और उनके द्वारा लगभग 4 बजे मुझे लिखित याचिका दी गई।
मैंने… pic.twitter.com/HLCl20RBSp
— Jagat Prakash Nadda (@JPNadda) July 20, 2026
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!