నిత్య పెళ్లికొడుకు శివశంకర్ (Shivashankar) కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు 11 మందిని మాత్రమే మోసం చేసినట్లుగా వచ్చిన వార్తలను నిజం కాదని, ఏకంగా 13 మంది మహిళలు శివశంకర్ మోసం చేసినట్టుగా బయటపడింది. వీధికి ఒకరిని పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రాంతానికి ఒకరిని వివాహం ఆడాడు. ఎక్కడ వెళితే అక్కడ వివాహం చేసుకొని డబ్బులు దండుకున్నాడు. అమ్మాయిలతో కాపురాలు చేశాడు. డబ్బులు తీసుకొని పారిపోయాడు…. ఇప్పటివరకు 13 మంది మహిళల్ని శివశంకర్ మోసం చేసినట్టుగా బయటపడింది. తెలుగు రాష్ట్రాల్లో ఫిర్యాదులు అందినప్పటికీ శివశంకర్ ని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. శివశంకర్ ని పోలీసులు పట్టుకోకపోవడం వెనకాల ఉన్న కారణాలు ఏంటో అర్థం కావట్లేదని బాధితులు అంటున్నారు.
శివశంకర్ బాధితులు పదకొండు మంది కాదు ఇంకా ఎక్కువే ఉన్నారన్న విషయాలు సంచలనంగా మారుతున్నాయి. నిత్య పెళ్లికొడుకు శివశంకర్ కేసు మలుపులు తిరుగుతోంది. ఇద్దరు మహిళలు ఆరోపణలు చేసిన మరుసటి రోజే, శివశంకర్ రియాక్టవడంతో ఈ కేసు ఇంట్రెస్టింగ్‌గా మారింది. తాను 11మందిని పెళ్లి చేసుకుని మోసం చేసుంటే ఇద్దరే ఎందుకు బయటికి వచ్చారు? మిగతవాళ్లెక్కడ? అంటూ లాజిక్ లాగడంతో, బాధితురాళ్ళు మరోసారి ఫైర్ అయ్యారు. బంధువులు, మహిళా సంఘాలతో కలిసి రామచంద్రాపురం (Ramachandrapuram) పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టింది. శివశంకర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. అతను గుంటూరులోనే ఉన్నానని చెబుతున్నా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
శివశంకర్ మోసాలకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మొత్తం 11 పెళ్లిళ్లు చేసుకున్నాడు. కేసులు కూడా ఉన్నాయి. మిగతావాళ్లు పరువు పోతుందనే బయటికి రావడం లేదు. మాలాగే మరో అమ్మాయి మోస పోకూడదనే నేను బయటకు వచ్చాను. పరువును కూడా పక్కనబెట్టి ముందుకొచ్చి న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే, ఎందుకు నిందితుడిని అరెస్ట్ చేయలేదు అంటోంది బాధితురాలు. గుంటూరు జిల్లా బేతపూడికి చెందిన శివశంకర్ గుట్టును ఆతని చేతిలో మోసపోయిన మహిళలు రట్టు చేశారు. అతనికి 2018లోనే పెళ్లయిందని, ఈ విషయాన్ని దాచి మ్యాట్రిమోని సైట్లలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పరిచయం చేసుకున్నాడు. విడాకులు తీసుకుని, అందంగా ఉండే యువతులను ఎంచుకుంటాడు. ఇలా కొండాపూర్‌లో తమతోపాటు.. మరో యువతితో కాపురాలు పెట్టినట్లు బాధితులు చెప్పారు. తమ దగ్గర వేర్వేరుగా రూ. 25 లక్షల చొప్పున నగదు, రూ.7 లక్షలు విలువ చేసే బంగారం తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. శివశంకర్ పై కేపీహెచ్‌బీ, రామచంద్రపురం, గచ్చిబౌలి, మాదాపూర్, బాలానగర్, ఎల్బీనగర్, ఏపీలోని గుంటూరు, అనంతపురం, మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లలో కేసులు ఉన్నాయి.
ఆంధ్ర తెలంగాణలో ఉన్న అమ్మాయిలను వలవేసి వంచించి డబ్బులు తీసుకుని శారీరకంగా వాడుకొని వదిలేస్తున్న శివశంకర్ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. శివశంకర్ ని అరెస్ట్ చేసి తమలాంటి మహిళలకు అన్యాయం జరగకుండా చూడాలని సదర్ మహిళలు కోరుతున్నారు. అందరూ మహిళలు వచ్చి ఏకంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఓ వ్యక్తి ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. వారి వద్ద నుంచి అందినకాడికి డబ్బులు దండుకుని ఆ తర్వాత వదిలేశాడు.ఇలా ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసం చేసిన నిత్య పెళ్లికొడుకు వ్యవహారం . గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివశంకర్‌బాబు వివాహ పరిచయ వేదిక ద్వారా పలువురు యువతలను పరిచయం చేసుకున్నాడు.
వివాహమై విడాకులు తీసుకున్న యువతులే లక్ష్యంగా ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. మోసపోయిన యువతులు అందరూ ఉన్నత విద్య అభ్యసించిన వారే కావడం గమనార్హం. పెద్ద కంపెనీ… డే అండ్ నైట్ డ్యూటీ అంటూ తమను పెళ్లి చేసుకున్నాడని బాధితులు వెల్లడించారు. పెళ్లైన తర్వాత అవసరాల కోసమని వారి వద్ద రూ.లక్షల్లో డబ్బు కాజేశాడు. తిరిగి డబ్బులు అడిగితే తెచ్చి ఇస్తానని చెప్పి ఉడాయించేవాడు.
ఆ తర్వాత కంటికి కనిపించేవాడు కాదని, ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చేదని మోసపోయిన బాధితులు వివరించారు. పెళ్లి పేరుతో మోసం చేశాడని, సుమారు రూ.60లక్షల వరకు నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చామని బాధితులు అంటున్నారు.. ఏ ఉద్యోగం లేని అతను క్లయింట్ వద్దకు వెళుతున్నానని చెప్పి మరో భార్య దగ్గరికి వెళ్లే వాడని వాపోయారు. మోసపోయిన 11 మందిలో ఏడుగురు కొండాపూర్ ప్రాంతంలోనే ఉన్నారని తెలిపారు. పక్క పక్క వీధుల్లో భార్యలను ఉంచి మోసానికి పాల్పడ్డాడని బాధితులు చెబుతున్నారు. ఏపీకి చెందిన ఓ మంత్రి బంధువునని శివశంకర్ చెప్పేవాడని మహిళలు వెల్లడించారు . తాము మోసపోయినట్టు మరొకరు మోసపోవద్దనే మీడియా ముందుకు వచ్చినట్టు చెప్పారు. శివశంకర్‌ను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.
Disney+ Hotstar: ‘పరంపర’ సీజన్ 1 వెజ్ థాలీ… సీజన్ 2 నాన్ వెజ్ మీల్స్!