భాగ్య నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం నుంచి పలు చోట్ల చిరుజల్లులు కురిసాయి. ఉదయం 6 గంటల నుంచి అక్కడక్కడ చిరజల్లులు కురుసాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ స్థంబించాయి. ప్రయానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు, రేపు నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
read laso: Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు.. భయపడేది లేదు..
అయితే.. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, అల్విన్‌కాలనీ, కేపీహెచ్‌బీ కాలనీలో వర్షం పడుతుంది. కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, షేక్‌పేట, లక్డీకపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, సైదాబాద్, శంషాబాద్, సాతంరాయి, గగన్‌పహాడ్, తండుపల్లి ప్రాంతాల్లో వాన కురుస్తున్నది. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీయగా కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సిద్ధిపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబాబాద్, ఖమ్మం, ములుగులో మోస్తరు వర్షాపాతం నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.
నిన్న అర్థరాత్రి నగరాన్ని వర్షం ముంచెత్తింది. ఉదయం కాస్త ఎండ నగరాన్ని తాకిన రాత్రి వర్షం ముంచెత్తింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. గండిపేట, బండ్లగూడ, రాజేంద్రనగర్, గచ్చిబౌలి,షేక్‌పేట, మణికొండ, బషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడిగూడ, దోమల్‌గూడ, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, జవహర్ నగర్, గాంధీనగర్, షేక్‌పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్, కిస్మత్‌పురా, సికింద్రాబాద్, బేగంపేట, దిల్‌సుఖ్‌నగర్, చాదర్‌ఘాట్ ఎల్బీనగర్, వనస్థలిపురంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Satyadev: ‘కృష్ణమ్మ’ టీజర్ ఆవిష్కరించిన సాయితేజ్!