Radha Tmt: ప్రముఖ స్టీల్ ఇండస్ట్రీ కంపెనీ రాధా టీంఎంటీ తన సరికొత్త మోడల్ రాధా రైనో 600 ప్లస్ ను ఆవిష్కరించింది. హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ కంపెనీ చైర్మన్ సునీల్ సరాఫ్, మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ సరాఫ్ లు అత్యాధునిక ఉత్పత్తి అయిన రాధా రైనో 600 ప్లస్ టీఎంటీ బార్ లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాధా టీఎంటీ ఎల్లప్పుడూ నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా ఈ బ్రాండ్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లతో పాటు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద తయారీదారుగా ప్రఖ్యాతి చెందిందన్నారు. బ్రాండ్ లోనే కాకుండా సరికొత్త సాంకేతికతను ఉపయోగించే ఏకైక తయారీదారుగా ఉంటోందని తెలిపారు.
Read also: 5G In India: 5జీ సేవలు మన మొబైల్స్‌ను చేరేదెప్పుడంటే..?
దేశంలో మొట్ట మొదటి 600 ప్లస్ గ్రేడ్ స్టీల్ తమదేనని మార్కెటింగ్ సేల్స్ మేనేజర్ చౌదరి తెలిపారు. సామాన్యుల నుంచి బిల్డర్స్ వరకు ఈ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాము స్టీల్ తయారు చేస్తున్నామన్నారు. దక్షిణ భారతదేశంలో మార్కెట్ లీడర్ గా ఉన్న రాధా టీఎంటీ 2025 నాటికి ఏటా మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు..
రాధా రైనో 600 ప్లస్ టీఎంటీ బార్లు 10శాతం అధిక దృఢత్వం, ఎక్కువ బ్రాండింగ్ లెన్త్ కలిగినవని తెలిపారు.. భూకంపాలు, అగ్ని ప్రమాదాలను తట్టుకోవడంతో పాటు తుప్పు నిరోధకాలుగా రూపొందించబడ్డాయని వారు చెప్పారు. అధీకృత డీలర్ల, నెట్వర్క్ ద్వారా భారతదేశం వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.