Gold Price: బంగారం కొనేవాళ్లకు ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు.. దీపావళి, ధన్ తేరాస్, కర్వా చౌథ్ రానున్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ కానుంది.
తెలంగాణ రాష్ట్రంతో సహా పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిస్థితి ఇంకా రెండు రోజులు ఇలాగే కొనసాగుతుందని తెలిపింది.
పీసీసీ మెంబర్స్ సమావేశంలో విహెచ్, ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ నెలకొంది. ఓబీసీలకు మాట్లాడే అవకాశం ఇవ్వరా..? అని వీహెచ్ అనడంతో..వీహెచ్ కి మైక్ ఇచ్చిన ఖర్గే .. మైక్ లేకుండానే మాట్లాడు మైక్ లో మాట్లాడితే మేము Ent డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది అంటూ వీహెచ్ పై సెటైర్లు వేశారు.
దాదాపు 75 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కల్వకుర్తి, కడప వాసులుగా గుర్తించారు.
JC Prabhakar Reddy: బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయగా.. శుక్రవారం నాడు జేసీ ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఈడీ ముందు హాజరయ్యారు. గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి ఆయన కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఈడీ సోదాలు జరిగాయి. అయితే కొద్ది కాలం క్రితమే జేసీ కుటుంబం తమ ప్రైవేటు బస్సుల వ్యాపారాన్ని నిలిపివేసింది. తాజాగా ఈడీ కార్యాలయంలో…
హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది. మెట్రో రైల్ వేళలను మరింతగా పొడిగిస్తూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 10.15 గంటల వరకే హైదరాబాద్‌లో మెట్రో సేవలు అందుతుండగా.. ఇకపై రాత్రి 11 గంటలకు పెంచాలని హైదరాబాద్ మెట్రోరైలు నిర్ణయించింది.
హైదరాబాద్‌లో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఇవాళ ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగరవాసులు తడిసిముద్దయ్యారు. భారీ వర్షం వల్ల రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్ లో అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రటైంది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న సభ్యులను హయత్ నగర్ పోలీసులు అదుపులో తీసుకున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న సభ్యులను మధ్యప్రదేశ్ కు చెందిన నరేంద్ర, చంద్రేశ్ లను అదుపులో తీసుకున్నామని తెలిపారు.
దేశ రాజకీయాల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ ఏకగ్రీవం తీర్మానం చేసిన విషయం తెలసిందే.. ఇక, ఈ తీర్మానం కాపీని ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అందజేశారు బీఆర్ఎస్ నేతలు… తెలంగాణ సీఎం ఇప్పటికే అనేకమార్లు ఢిల్లీలో పర్యటించిన కేసీఆర్.. ఇప్పుడు మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తారని తెలుస్తోంది..…