Gold Rate : బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి షాక్.. రేటు ఏకంగా ఏడు నెలల గరిష్టానికి చేరింది. ఇది పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ కావాలనుకునే వారికి భారీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్ర అనిశ్చిత పరిస్థితుల వేళ ధరలు అందనంత ఎత్తుకు చేరిపోతున్నాయి. ఈ ఒక్క రోజులోనే బంగారం ధర రూ.750లు పెరిగింది. దీంతో ఈ నెలలో ఇదే గరిష్ట పెంపుగా భావించొచ్చు. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.48 వేలుగా ఉంది. నేడు అది రూ.48 వేల 750కి చేరింది. ఈ నెలలో ఇదే గరిష్ట విలువ కావడంతో పాటు.. గత 7 నెలలుగా చూసినా ఇదే అత్యధిక రేటు. చివరిసారి ఏప్రిల్ లో తులం బంగారం ధర రూ.49 వేల మార్కుదాటింది. ఆ తర్వాత ఇదే అత్యధికం. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.820 మేర పెరిగి రూ.53 వేల 180కి చేరింది.
Read Also: Crime : సభ్య సమాజం తలవంచుకునే ఘటన.. ఆరేళ్లుగా బాలికపై తండ్రి, తాత, అంకుల్ అత్యాచారం
Also Read
వెండి విషయానికి వస్తే రేటు ఈ రోజు తగ్గింది. ఏకంగా రూ.1300 మేర పతనమైంది. దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.67 వేల200కు చేరింది. నిన్న రూ.68 వేల500 వద్ద ఉంది. అంతకుముందు 5 రోజుల్లో వరుసగా వెండి ధర రూ. 2600 మేర పెరిగింది. అటు దేశ రాజధాని ఢిల్లీలో సైతం వెండి ధరలు తక్కువగానే ఉంటాయి. అక్కడ కిలో సిల్వర్ రూ.62 వేలు మాత్రమే ఉంది. ఇక 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.48 వేల 900 వద్ద ఉంది. అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1764 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 21 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఇక రూపాయి పతనం మళ్లీ కొనసాగుతోంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.68 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల రూ.83 లెవెల్స్‌కు చేరిన నేపథ్యంలో మరోసారి ఆ విలువకు వెళ్తుందేమోననే ఆందోళనలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!