హైదరాబాద్‌లో మరో భారీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వెలుగుచూసింది... దేశవ్యాప్తంగా ఏకంగా 600 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత తొలిసారి ఢిల్లీలో అడుగుపెట్టిన కేసీఆర్.. తన అధికార నివాసంలో బస చేస్తున్నారు.. ఈ వారాంతం వరకు హస్తినలోనే కేసీఆర్ మకాం వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాజాసింగ్ పై పీడీ యాక్ట్ విషయంలో ఈ నెల 20వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.. మరోసారి కౌంటర్ దాఖలుకు గడువు పొడిగించేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు..
కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఠాగూర్ నెల రోజుల పాటు రాష్ట్రంలోనే ఉంటారు. మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో ఠాగూర్ రంగంలోకి దిగారు. ఇవాళ సాయంత్రం వచ్చి మూడు రోజుల తర్వాత వెళ్లి మళ్లీ నగరానికి తిరిగి రానున్నారు.
ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మొత్తం మునుగోడు ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి.. బైపోల్లో నామినేషన్ల పర్వ కొనసాగుతుండగా.. ఉప ఎన్నికల పర్వం కీలక స్థాయికి చేరుకున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. ఈ ఎన్నికలో కారును పోలిన గుర్తులు ఏకంగా ఎనిమిది ఉన్నాయి.. గతంలోనే కారును పోలిన గుర్తులతోనే కొన్ని నియోజకవర్గాల్లో దెబ్బతిన్న గులాబీ పార్టీ.. ఇప్పుడు ఎన్నికలకు ముందే మోల్కోంది.. ఎన్నిక గుర్తుల జాబితాలో కెమెరా, చపాతీ రోలర్, డాలీ, రోడ్…
హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో యానిమల్ వాక్సిన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్). ఈ యూనిట్ ద్వారా రాష్ట్రంలో ఏకంగా రూ.700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధమైంది ఐఐఎల్.
Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మళ్లీ చిక్కుల్లో పడింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ నిబంధనలు అతిక్రమించారని ఆరోపిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యులు రాచకొండ సీపీ మహేష్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. గత నెల 26తో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ పదవీ కాలం ముగిసిందని హెచ్‌సీఏ మాజీ ప్రెసిడెంట్ జి.వినోద్, మాజీ సెక్రటరీ శేషు నారాయణ్, మాజీ మెంబర్ చిట్టి శ్రీధర్‌బాబు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హెచ్‌సీఏపై పోలీసులు…
కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ రేపు హైదరాబాద్ రానున్నారు. ఠాగూర్ నెల రోజుల పాటు రాష్ట్రంలోనే ఉంటారు. మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో ఠాగూర్ రంగంలోకి దిగారు. రేపు సాయంత్రం వచ్చి మూడు రోజుల తర్వాత వెళ్లి మళ్లీ నగరానికి తిరిగి రానున్నారు.
నగరంలోని పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్గు రోడ్డు వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అలర్ట్ అయిన కారువారు బయటకు పరుగులు తీసారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.