YS Sharmila: ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినతిపత్రం అందించారు.
తెలుగు రాష్ట్రాలలో క్రికెట్ ప్రియులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. బంగ్లాదేశ్‌తో సిరీస్ తర్వాత టీమిండియా స్వదేశంలో వరుసగా శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లు ఆడనుంది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. వీటిలో హైదరాబాద్, విశాఖలకు కూడా మ్యాచ్‌లను కేటాయించింది. జనవరి 18న హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో టీమిండియా తొలి వన్డే ఆడనుండగా… మార్చి 19న విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడనుంది. మూడు నెలల కాలంలో తెలుగు రాష్ట్రాలలో రెండు అంతర్జాతీయ…
Allu Arjun Multiplex: మొన్న మహేష్ బాబుతో కలసి ఏఎంబీ సినిమాస్, నిన్న విజయ్ దేవరకొండతో ఏవీడీ సినిమాస్‌ను ఆరంభించిన ఏషియన్ ఫిలిమ్స్ సంస్థ అల్లు అర్జున్‌తో కూడా చేతులు కలిపిన విషయం తెలిసిందే. నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ దిగ్గజంగా పేరున్న ఏషియన్ ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలంగాణలో మెజారిటీ థియేటర్లను కలిగిఉంది. ఏషియన్ గ్రూప్ ఇప్పటికే పలు మల్టీప్లెక్స్‌తో పాటు అనేక సింగిల్ స్క్రీన్లను సొంతంగా నిర్మించటమో లేక లీజ్ కు తీసుకుని ఉండటమో చేస్తోంది.…
హైదరాబాద్‌తో పాటు విశ్వనగరం చుట్టూ ఉన్న ప్రాంతాలకు కూడా గుడ్‌న్యూస్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవాళ మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ పోలీసు అకాడమీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.. మైండ్ స్పేస్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరం.. వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ, జీఎంఆర్…
తెలంగాణ రాష్ట్రానికి డిసెంబర్ 9వ తేదీ చాలా ప్రత్యేకమైనది.. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు.. అంటే 2009 డిసెంబర్ 9న తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపు లభించింది.. ఉవ్వెత్తున్న ఎగసిన ఉద్యమం ఓవైపు, ఆత్మబలిదానాలు మరోవైపు, ఉద్యమనేత కేసీఆర్ అకుంఠిత దీక్ష.. ఇలా అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం.. తెలంగాణపై ప్రకటన చేసింది.. ఉద్యమరూపం భావజాల వ్యాప్తి దశ నుంచి పోరాట పథానికి మారిన సందర్భం. ఉద్యమనేత, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్…
హైదరాబాద్‌లో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్ కు తెలంగాణ సిద్దమైంది. విశ్వనగరంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్ భవిష్యత్తు రవాణా అవసరాలను తీర్చడంతోపాటు శంషాబాద్ విమానాశ్రయానికి అతి తక్కువ సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకునేలా మెట్రో ప్రాజెక్టు (ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ హైవే)ను రూపొందించనున్నారు.
సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మాదాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించనున్న మెట్రోరైలు నిర్మాణ పనుల శంకుస్థాపనలో భాగంగా.. రేపు (ఈనెల9)న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని మాదాపూర్, నార్సింగి ఠాణాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు వెల్లడించారు.
విజయవాడలో జయహో బీసీ మహాసభ.. బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కేబినెట్లో బీసీలకు భారీగా అవకాశాలు కల్పించారు.. కిందిస్థాయిలో కూడా బీసీలకు పెద్దపీఠవేశారు.. ఇక, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో వెనుకబడిన వర్గాల ప్రజలను ఏం చేశామని చెప్పేందుకు సిద్ధం అవుతోంది వైసీపీ.. దీనికోసం విజయవాడలో ఇందిరాగాంధీ మున్సి పల్ స్టేడియం వేదికగా నేడు జయహో బీసీ మహాసభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది..…
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసే విషయంలో సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కొద్ది రోజుల క్రితం సీఆర్పీసీ 160 కింది ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే కాగా.. డిసెంబర్ 6వ తేదీన అంటే ఈరోజు తమను కలవాలని.. ఢిల్లీలోనైనా సరే.. హైదరాబాద్‌లోనైనా సరే అని పేర్కొంది సీబీఐ.. అయితే, శనివారం రోజు సీబీఐకి లేఖ రాసిన కవిత.. ఈ కేసులో ఎంహెచ్ఏ…