Girl Cheated: ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు.. తనకంటే ఆమెనే నమ్మాడు. తను ఏంచెప్పిన సరే నంటూ తల ఊపాడు. ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకుని అన్యోన్య దాంపత్య జీవితం గడపేందుకు కలగన్నాడు. ప్రేమించిన యువతి కోసం ప్రాణాలైనా వదలడానికి సిద్దమయ్యాడు. అన్నంతపని చేశాడు. ఆమె మోసానికి తట్టుకోలేకపోయాడు. తన ప్రేమను ఆమె అవసరంగా భావించిందే తప్పా.. ప్రేమగా అంగీకరించలేకపోయిందని తెలిసి మనోవేదన పడ్డాడు.. దీంతో ఆయువకుడి గుండె పగిలింది. రోజూ చస్తూ.. ఆమెను గుర్తు చేసుకుంటూ బతికేకన్నా.. చనిపోదామనుకున్నాడు. అన్నంతపని చేశాడు. రైతలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ తనలా ఆయువతి చేతిలో మోసపోయిన వారికి న్యాయం చేయాలని సూసైడ్ నోట్ రాశాడు. కానీ ఇది చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తను ఆత్మహత్య చేసుకోలేదని.. ఎవరో కావాలనే తన కొడుకుని చంపి రైతలు కింత పడేశారని ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేరస్థులు ఎవరైనా వదిలేది లేదని చెబుతున్నారు.
అసలేం జరిగింది:
గాఢంగా ప్రేమించిన యువతి మోసం చేసిందని ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఆ యువతి మోసాన్ని భరించలేక రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే.. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే.. ప్రేమించిన అమ్మాయి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా.. అవసరానికి డబ్బులు ఇస్తే ప్రైవేట్ రిలేషన్ షిప్‌లో ఉందామని యువతి చెప్పిందని లేఖలో పేర్కొన్నాడు. ప్రియురాలికి ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగితే తన కుటుంబంపై కేసు పెట్టిందని ఆలేఖలో ప్కేర్కొన్నాడు యువకుడు. అది తట్టులేకపోయాడు.. తనవల్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదని ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా లేఖలో తెలిపాడు. కాగా.. యవకుడు ఆత్మహత్య చేసుకోలేదని ఎవరో హత్య చేసి ఉంటారని అతడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అటు విజయవాడలో కూడా తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి మోసం చేసిందని ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో తనలా మోసపోయిన యువకులకు న్యాయం చేయాలని కోరడం సంచలనంగా మారింది.