తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ విజయవాడకు చేరుకున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరారు తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అవుతున్నారు. అనంతరం 11 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ కానున్నారు సోమేష్ కుమార్. అయితే ఆయన ఏపీలో రిపోర్ట్ చేశాక ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. అయితే ఆయన వీఆర్‌ఎస్ తీసుకుంటారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే తనకు వీఆర్ఎస్ కు తొందర లేదు అన్నారు సోమేష్ కుమార్. కుటుంబసభ్యులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానంటున్నారు. డీవోపీటీ ఆదేశాలను గౌరవిస్తూ ఏపీలో రిపోర్ట్ చేస్తున్నా అన్నారు. ఏపీ సీఎస్‌ను కలిశాక నిర్ణయం తీసుకుంటానన్నారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తో భేటీ అయ్యారు సోమేశ్ కుమార్. విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. . సోమేశ్ కుమార్ సేవలను ముఖ్యమంత్రి జగన్ ఏ రకంగా ఉపయోగించుకోనున్నారనే అంశం పై ఆసక్తి ఏర్పడింది. సీఎంతో భేటీ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.
తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్ కి ఏ పోస్టు కేటాయిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఇక్కడి విధుల నుంచి రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా.. వెంటనే ఏపీ గవర్నమెంట్‌కు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.
Read Also: Himachal Pradesh: మంత్రిత్వ శాఖలు కేటాయించిన సీఎం సుఖు.. ఎవరికి ఏం ఇచ్చారంటే?
అయితే.. సోమేష్ కుమార్ మరో ఏడాదిలో రిటైర్ కానున్నారు. అయితే.. ఏపీకి వెళ్లేందుకు సోమేశ్ కుమార్ విముఖతగా ఉన్నట్లు.. ఈ క్రమంలోనే వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దగ్గర ఏదో ఒక పోస్టులో ఉంటారనే ప్రచారం కూడా సాగింది..మూడు సంవత్సరాలకు పైగా అత్యున్నత పదవిలో పనిచేసిన సోమేష్ కుమార్.. ఆంధ్ర ప్రభుత్వంలో చేరడం ద్వారా సానుకూల సంకేతం పంపారని చివరి వరకు.. అంటే పదవీ విరమణ వయస్సు వచ్చే వరకు సేవ చేయాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.