Veera Simha Reddy: భ్రమరాంబ థియేటర్ వద్ద బాలయ్య ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veera Simha Reddy: నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రధాన పాత్రలో.. గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు రోజుల ముందే అభిమానులకు సంక్రాంతి పండుగను తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకు అనుమతి ఇవ్వడంతో తెల్లవారుజామున 4 గంటల నుంచే షోలు ప్రారంభమయ్యాయి. దీంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి ఓ రేంజ్ లో సాగింది. రాష్ట్రవ్యాప్తంగా వీరసింహారెడ్డి విడుదలైన థియేటర్ల వద్ద బాలకృష్ణ అభిమానులు సందడి చేశారు. మరోవైపు భాగ్యనగరంలో పలు థియేటర్ల వద్ద అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు సందడి చేశారు.
Read also: Ukraine Crisis: ఆ క్షిపణులతో ఉక్రెయిన్ ఈ ఏడాది యుద్ధంలో విజయం సాధించగలదు..
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
భ్రమరాంబ థియేటర్ హైదరాబాదీలకు చాలా పేరుంది. అభిమానులు, ప్రేక్షకులతో కలిసి వీరసింహారెడ్డి ఫస్ట్ డే ఫస్ట్ షో వీక్షించేందుకు బాలకృష్ణ భ్రమరాంబ థియేటర్‌కి చేరుకుని సందడి చేశారు. దీంతో.. కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ వద్ద అభిమానుల సందడి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఫైర్ క్రాకర్లు, డప్పు వాయిద్యాలు, నృత్యాలు సందడి సృష్టించాయి. బాలయ్యబాబు, గోపీచంద్ మలినేనిలతో పాటు చిత్ర యూనిట్ అభిమానులతో కలిసి థియేటర్ వద్ద సందడి చేశారు. హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని థియేటర్‌లో అభిమానుల మధ్య కూర్చుని సినిమా చూశారు. మరోవైపు వీరసింహారెడ్డి సినిమా కూడా అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్లింది. నిజానికి బాలయ్య సినిమాకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ జరగడం ఇదే తొలిసారి. అడ్వాన్స్ బుకింగ్‌తో హైదరాబాద్‌లో 11.42 లక్షలు, బెంగళూరులో 30 లక్షలు, చెన్నైలో 4 లక్షలు, వరంగల్‌లో 17.58 లక్షలు, ముంబైలో 1.52 లక్షల రూపాయలు సొంతం చేసుకుంది. నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విడుదలకు ముందు రోజు రాత్రి నుంచే బాలయ్య అభిమానులు థియేటర్ల ముందు సంబరాలు చేసుకున్నారు.
ప్రతి సీన్‌లోనూ, ప్రతి షార్ట్‌లోనూ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అభిమానులకు థియేటర్లలో ఊపునిస్తుంది. అంతేకాదు బాలయ్య – తమన్ కాంబోలో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ రేంజ్ లో కష్టాలు పడుతూనే తమన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్స్ లో బాలయ్య అభిమానులకు స్పెషల్ ట్రీట్ తీసుకొచ్చాడంటే అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా మాస్ మొగుడు.. సుగుణసుందరి పాట ప్లే అవుతుంటే సీట్లలో కూర్చోకుండా దూకేసే అభిమానుల అరుపులతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చింది. మరి కలెక్షన్ల పరంగా వీరసింహారెడ్డి ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో లేక బద్దలు కొడతాడో చూడాలి..?
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..