Ganta Meets Nara Lokesh: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇవాళ సమావేశం అయ్యారు.. లోకేష్‌ను గంటా కలవడం సాధారణ విషయమే.. కానీ, పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉండడం.. ఆయనపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. ఇవాళ హైదరాబాద్‌లో నారా లోకేష్‌తో సమావేశం అయ్యారు గంటా శ్రీనివాసరావు.. దాదాపు 30 నిమిషాలకు పైగానే వీరి సమావేశం అయినట్టు తెలుస్తోంది.. అయితే, చాలా కాలం తర్వాత లోకేష్‌తో గంటా చర్చలు జరపడం చర్చగా మారింది.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు మారుతుండడంతో అధిష్టానానికి దగ్గరయ్యే ప్రయత్నాలు గంటా చేస్తున్నారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఉమ్మడి విశాఖలో చాలా నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్‌లను ఖరారు చేస్తోంది.. ఈ తరుణంలోనే ఈ సమావేశం జరిగినట్టుగా ప్రచారం సాగుతోంది..
Read Also: Nandamuri Traka Ratna: నారా లోకేష్ తో తారకరత్న భేటీ.. ఎమ్మెల్యేగా అక్కడినుంచే పోటీ..?
కాగా, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పరాజయం చవిచూసి.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది.. అయితే, అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు గంటా శ్రీనివాసరావు.. పార్టీ కార్యక్రమాలకు రావాలని అధిష్టానం కోరినా.. పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చినా.. గంటా కనబడిన సందర్భాలు చాలా తక్కువ.. పార్టీ సభ్యత్వ విషయంతో పాటు కమిటీల ఏర్పాటుపై గంటా శ్రద్ధ పెట్టలేదనే ఆరోపణలున్నాయి. పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో ఆయన దూరంగా ఉండడంతో హై కమాండ్.. ఆయనపై అసంతృప్తిగా ఉందనే ప్రచారం సాగుతోంది.. ఈ తరుణంలో నారా లోకేష్ నివాసానికి వచ్చిన గంటా.. సుదీర్ఘంగా చర్చలు జరిపారు.. అయితే, తాను ఇంతకాలం పార్టీకి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది… తదితర అంశాలను లోకేష్‌కు వివరించినట్లు తెలుస్తోంది.. గంటా మళ్లీ టీడీపీకి దగ్గర అయ్యేందకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.. కానీ, గంటా విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
అయితే, 2019 ఎన్నిల్లో విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు గంటా శ్రీనివాసరావు.. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో.. ఆయన పార్టీ మారడం ఖాయమనే ప్రచారం కూడా సాగింది.. బీజేపీలోకి వెళ్తారని కొంతకాలం.. లేదు.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు దగ్గరయ్యారు.. ఫ్యాన్ కిందకు చేరతారని మరోవైపు ప్రచారం సాగుతూ వచ్చింది.. కానీ, ఆ ప్రచారాన్ని పలు సందర్భాల్లో ఆయన ఖండిస్తూ వచ్చారు.. కానీ, పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు.. ఇదే సమయంలో.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా చేసినా.. అది ఆమోదం పొందని విషయం విదితమే.