Teachers Transfers and Promotions: టీచర్ల బదిలీలు తెలంగాణ రాష్ట్రంలో ఆ మధ్య తీవ్ర వివాదాన్ని సృష్టించాయి.. ఇప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు ఈ వ్యవహారంలో ఆందోళనను చేస్తూనే ఉన్నాయి.. అయితే, ఇప్పుడు బదిలీలు, ప్రమోషన్లకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. రాష్ట్రంలో ఇవాళ్టి నుండి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది.. దీనికి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేసింది విద్యా శాఖ.. 37 రోజుల పాటు ఈ ప్రాసెస్ కొనసాగనుంది.. ఇప్పుడు బదిలీ అయిన,…
శ్రీరామ చంద్రమీసన్ ఆదిగురువు లాలాజీ మహరాజ్ 150వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని కన్హశాంతి వనంలో ఘనంగా నిర్వహించారు. ఈజయంతి వేడుకల్లో సంగీత ఉత్సవం నిర్వహిస్తారు.
Red Alert at Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెడ్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు.. జనవరి 31వ తేదీ వరకు ఎయిర్ పోర్ట్‌కు రెడ్ అలెర్ట్ ప్రకటించారు సెక్యూరిటీ ఆధికారులు, పోలీసులు.. ఈ నెల 31వ తేదీ వరకు సందర్శకులకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.. ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు.. ఎయిర్ పోర్ట్ కు వచ్చే…
Police License: హైదరాబాద్‌లో వ్యాపారులకు పోలీస్ లైసెన్స్ కూడా తప్పనిసరి చేశారు.. వ్యాపారం చేయాలంటే.. ట్రేడ్ లైసెన్సు, ఫుడ్ లైసెన్స్, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీతో పాటు ఇప్పుడు పోలీసు లైసెన్స్ కూడా కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.. 2014 తర్వాత ఈ లైసెన్స్ విధానాన్ని రద్దు చేశారు సిటీ పోలీసులు.. అయితే, ఇప్పుడు మళ్లీ ఆ నిబంధన తీసుకొచ్చారు.. తొమ్మిదేళ్ల తర్వాత పోలీసు లైసెన్స్ నిబంధన అమలు చేస్తున్నారు.. స్టార్ హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, పట్లు,…
Constable Candidates Protest: హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనను భగ్నం చేశారు పోలీసులు.. ఎన్ఎస్యూఐ నేత బల్మురి వెంకట్, కార్పొరేటర్ విజయ రెడ్డిలను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులను అరెస్ట్ చేశారు.. అయితే, మాకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు.. 1600/800 మీటర్ల పరుగు పందెంలో క్వాలిఫై అయిన అభ్యర్థులను.. ఎగ్జామ్ రాసేందుకు అనుమతించాలని ఆందోళనకు చేశారు.. లాంగ్…
Telangana New Secretariat inauguration: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త సచివాలయం నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.. నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు.. వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17వ తేదీన శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గంటల నడుమ నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.…
Gun Firing: హైదరాబాద్ శివారులో కాల్పులు కలకలం సృష్టించాయి.. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్ దగ్గర ఓ వైన్ షాపు యజమాని బెదిరించి.. అతని దగ్గర ఉన్న డబ్బుతో ఉడాయించారు.. మేడ్చల్ జిల్లా ఉద్దిమర్రి దగ్గర ఈ ఘటన జరిగింది.. ఉద్దమర్రిలో మద్యం షాపు నిర్వహిస్తోన్న బాలకృష్ణ అనే వ్యక్తి.. రాత్రి వైన్‌షాపును మూసివేసి తిరిగి వెళ్తున్న సమయంలో.. దుండగులు ఎటాక్ చేశారు.. తుపాకీతో బెదిరించారు.. మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తోంది.. ఆ తర్వాత కర్రలతో…
Hyderabad Central University: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో కలకలం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ను ప్రదర్శించడం వివాదాస్పదం అయింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. యూనివర్సిటీలో కొంతమంది ప్రధాని మోదీ డాక్యుమెంటరీని ప్రదర్శించారని క్యాంపస్ అధికారులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఫిర్యాదు చేసింది. దీంతో మరోసారి హెచ్‌సీయూ వార్తల్లో నిలిచింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాతబస్తీలోని జియాగూడలో ఆదివారం నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈఘటనను సవాల్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు చేధించారు.
ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అమెజాన్ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్ ఎయిర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచంలో హైదర్ బాద్ లో అమెజాన్ కు అతి పెద్ద క్యాంపస్ ఉందన్నారు.