సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో నేటి నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ఈనేపథ్యంలో.. స్థానికులు ప్రజలు తమ సమస్యలను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
హైదరాబాద్ లోని శ్రీ ఆదిత్య హోమ్స్ లో ఐటీ సోదాలు ముగిసాయి. ఐదు రోజుల పాటు ఐటి సోదాలు కొనసాగాయి. శ్రీ ఆదిత్య హోమ్స్ డైరెక్టర్ల నుండి అనుమానాస్పద లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారు.
Crescent Cricket Cup: ప్రతి ఏడాది హైదరాబాద్లో సినీ తారల క్రికెట్ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ‘క్రెసెంట్ క్రికెట్ కప్’ (సీసీసీ) ఫిబ్రవరి 26న ఎల్బీ స్టేడియంలో వేదికగా నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. టాలీవుడ్, బాలీవుడ్ నటులు తలపడే ఈ పోటీల్లో ఈ ఏడాది ‘సే నో టు డ్రగ్స్’ అనే అంశంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని ఓ హోటల్లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ, సినిమాటోగ్రఫీ…
Asaduddin Owaisi: హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చే శారు.. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశ పార్లమెంట్లో అన్ని వర్గాల ఎంపీలు ఎన్నికై వస్తారు.. కానీ, ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా ఓ లీడర్ కింద ఎదగడం రాజకీయ పార్టీలకి నచ్చదని విమర్శించారు.. దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకి బానిసలుగా ఉండాలని పార్టీల నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు.. 70 ఏళ్లుగా మమ్మల్ని ఇదే విధంగా దోచుకున్నారని…
విప్లవ యోధుడు చేగువేరా కుమార్తె డా.అలైదా గువేరా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్టే ఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అలైదా గువేరా, ఆమె కుమార్తె ఎస్తెఫానియా గువేరా ఈ ఉదయం కోల్కతా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
విప్లవ యోధుడు చేగువేరా కుమార్తె డా.అలైదా గువేరా నేడు హైదరాబాద్ రానున్నారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్టే ఫానియా గువేరా కూడా నగరానికి వస్తున్నారు. ఇవాళ (ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే 'క్యూబా సంఘీభావ సభ'కు అలైదా గువేరా, ఎస్టీ ఫానియా ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు.
హైదరాబాద్ లో శ్రీ ఆదిత్య హోమ్స్ లో మూడవరోజు ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఊర్జిత, ట్రెడెంట్ ప్రాపర్టీస్ లో సోదాలు చేపట్టారు. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ రిటర్న్స్లో అవకతవకలను ఐటీ అధికారులు గుర్తించారు. ఫ్లాట్ల అమ్మకాలపై ఐటీ శాఖ వివరాలు సేకరిస్తున్నారు.
ఉస్మానియా పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మిస్సింగ్ కేసులో ట్విస్ట్ బయటపడింది. ఈనెల 5వ తేదీన చంద్రకళ అనే మహిళ కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యులు పోలీసులు ఆశ్రయించారు.