ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు లేకపోవడంపై దాఖలైన పిటిషన్ పై ఇవాళ ( మంగళవారం ) తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉచిత, నిర్బంధ, విద్య హక్కు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని పిటీషనర్ వాదనలు వినిపించాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బాలికలు, బాలురు జీవించే హక్కును కలిగి ఉన్నారని పిటీషనర్ పేర్కొన్నారు. నాణ్యమైన ఆహారం లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు అంటూ తెలిపారు. మంచినీరు, కిచెన్, మరుగుదొడ్లు పరిశుభ్రత లేక విద్యార్థులు కడుపు నొప్పి, తలనొప్పి, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారన్న పటిషనర్ హైకోర్టుకు తెలిపారు.
Read Also: Bandla Ganesh: చీము నెత్తురు ఉన్న ఉద్యోగులు బాబు కోసం నెల రోజులు ధర్నాలు చేయాలి !
దీంతో పిటిషనర్ వాదనలు విన్న తర్వాత తెలంగాణ ప్రభుత్వం సమగ్ర నివేదికను సమర్పించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల డివిజన్ బెంచ్ తెలిపింది. ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్టల్స్ లోని బాత్రూమ్స్, టాయిలెట్స్, దిండ్లు, పరుపులు లాంటివి విద్యార్థులకు సరిపడా ఉన్నాయో.. లేవో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అగ్నిమాపక యంత్రాలు, వార్డెన్ల సంఖ్యతో కూడిన లిస్ట్ ను ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ హాస్టల్స్ లో బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్–2018 నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వసతుల్లేవంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ మేరకు సౌకర్యాలు కల్పించడం లేదని.. పది మందికి ఒకే బాత్ రూం, ఏడుగురికి ఒక టాయిలెట్, 50 మందికో వార్డెన్ ఉండాలనే నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషనర్ తరపు లాయర్ వాదించాడు.
Read Also: PM Modi: ప్రధాని మోడీ ఫోన్ హ్యాక్, ట్రాక్ చేయలేరు..