Navdeep In Drugs Case: మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణ మొదలైంది.. హీరో నవదీప్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు ప్రశ్నిస్తున్నారు.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఏ 29గా హీరో నవదీప్ ఉన్న విషయం తెలిసిందే కాగా.. డ్రగ్స్ సప్లయర్ రామచందర్‌తో నవదీప్‌కు ఉన్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు.. నవదీప్ ద్వారానే ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్టు అనుమానిస్తున్నారు. అదే కోణంలో ప్రశ్నలు సంధిస్తున్నారట.. సప్లయర్ రామచందర్ పట్టుబడినప్పటి నుంచి హీరో నవదీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.. 41 ఏ సీఆర్‌పీసీ కింద విచారణకు హాజరు కావాలని నవదీప్‌కు సూచించింది. ఇక, కోర్టు ఆదేశాల నేపథ్యంలో నవదీప్‌కు 41 ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసిన అధికారులు.. ఈ రోజు నవదీప్‌ను ప్రశ్నిస్తున్నారు.
నవదీప్ ముందు 20 ప్రశ్నలు ఇచ్చిన నార్కోటిక్ బ్యూరో అధికారులు.. రామచందర్ తో పరిచాయలపై అధికారులు ఆరాతీస్తున్నట్టుగా తెలుస్తోంది.. నవదీప్, రామచందర్ ఇద్దరు అత్యంత సన్నిహితులు ఉన్నారని.. ఇద్దరు కలిసి ఎప్పుడు..? ఎక్కడ..? ఎలా..? డ్రగ్స్ తీసుకున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట.. రామచందర్ తో ఉన్న పరిచయం ఏంటి..? రామచందర్‌ను చివరిసారిగా ఎప్పుడు కలిశారు ..? రామచందర్ ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చేవాడు..? లాంటి ప్రశ్నలను నవదీప్‌ను సంధిస్తున్నారట అధికారులు.
ఇక, మాజీ ఎంపీ విట్టల్ రావు కుమారుడు సురేష్‌తో ఉన్న పరిచయాలు ఏంటి? అని కూడా నవదీప్‌ను ప్రశ్నించారట.. సురేష్ ,రామచందర్ లతో కలిసి ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారా..? రామచందర్ , సురేష్ లకు ఎప్పుడైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారా..? అనే వివరాలతో పాటు స్నార్ట్ పబ్ వ్యవహారాలపై నార్కోటిక్ బ్యూరో అధికారుల ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే.. నవదీప్ ద్వారానే తెలుగు సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్టు అనుమానాలు ఉన్నాయి.. నవదీప్‌ను నార్కోటిక్ బ్యూరో అధికారులు ప్రశ్నిస్తున్న తరుణంలో.. సినీ సిండస్ట్రీలోని పెద్దల్లో టెన్షన్ మొదలైనట్టు ప్రచారం సాగుతోంది. మరి నవదీప్ విచారణలో ఎలాంటి అంశాలు బయటపెట్టనున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.