CWC Meeting: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా ఆయన అధ్యక్షతన హైదరాబాద్‌లో శనివారం నుంచి రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది.
కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలి సమావేశం శనివారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణాలో నిర్వహించనున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ వ్యూహం, విపక్షాల కూటమి (INDIA), రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా.. 'భారత్ జోడో యాత్ర' రెండో దశపై కూడా ఈ వర్కింగ్ కమిటీలో చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈడీ బోడిలకు భయపడేది లేదు అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఏం జరిగినా దేశం అగ్నిగుండమేనంటూ ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ని రాజకీయంగా తట్టుకోలేకే ఈ డ్రామాలు.. మహిళా బిల్లు కోసం దేశం అంత మద్దతు కోసం కవిత లేఖలు రాస్తే చూడలేకే.. ఈడీ ఈ నోటీసులు ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై నేడు (గురువారం) వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు నిర్వహించారు.
హైదరాబాద్ నగరంలో ఒక గంట నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు మామూలుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంట వ్యవధిలోనే ఆకాశం మబ్బు పట్టింది.. ఇక, నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడుతుంది.
Hyderabad: తెలంగాణలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఈ ర్యాగింగ్ భూతం వల్ల ఎంతో మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును కోల్పోయారు. నిజానికి అన్ని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు వేస్తున్నారు.
వైద్యో నారాయణో హరీ అంటారు.. దీని అర్ధం వైద్యుడు దేవునితో సమానం.. ఎందుకంటే జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే.. పునర్జన్మ నిచ్చేది వైద్యులు.. అందుకే డాక్టర్ ని దేవునితో సమానంగా చూస్తారు..
అయితే.. నిన్న ( ఆదివారం ) ఒక్కరోజే ఏకంగా 2781 మంది మంది ఆశవాహులు అప్లయ్ చేశారు. దీంతో.. బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కోసం వచ్చిన మొత్తం దరఖాస్తులు సంఖ్య 6003కు చేరింది. దీంతో.. బీజేపీకి తెలంగాణలో ఫుల్ డిమాండ్ ఉంది. బీజేపీ తరఫున పోటీ చేసేందుకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. పంజాగుట సర్కిల్ లోని మెరిడియన్ హోటల్ కు బిర్యానీ తినేందుకు వచ్చిన కస్టమర్ లియాకత్ తో హోటల్ సిబ్బంది గోడవపడ్డారు. ఎక్స్ ట్రా పెరుగు తీసుకోవాని రావాలని అడగడంతో గొడవ ప్రారంభమైంది. హోటల్ లో లియాకత్ పై సిబ్బంది దాడికి పాల్పడ్డారు.