Singareni Election: సింగరేణి ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర కార్మిక శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సింగరేణి ఎన్నికలపై వివాదం కొనసాగుతునే ఉంది. సింగరేణి ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కార్మిక సంఘం ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడంలేదని కేంద్ర కార్మిక శాఖ పిటిషన్ వేసింది. వివరాల ప్రకారం.. సింగరేణి ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును ఆశ్రయించింది. సింగరేణిలో కార్మిక సంఘం ఎన్నికలకు సంస్థ యాజమాన్యం సహకరించడంలేదని హైకోర్టులో పిటిషన్ వేసింది. గత నెల 27న మీటింగ్‌కు సింగరేణి యాజమాన్యం హాజరు కాలేదని కేంద్ర కార్మిక సంఘం పేర్కొంది. సింగరేణి తుది ఓటర్ల జాబితాను ఇప్పటి వరకు ప్రకటించలేదని వెల్లడించింది.
Read Also: Fire Accident: బెంగళూరులోని బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
Also Read
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
అయితే, తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఈనెల 28న ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ చేశామని కేంద్రం పేర్కొంది. సింగరేణి సహాయ నిరాకరణ వల్ల ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని వెల్లడించింది. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్రం పిటిషన్‌లో తెలిపింది. ఇక, సింగరేణి అప్పీల్‌తో కలిపి కేంద్ర కార్మికశాఖ పిటిషన్‌పై ఈనెల 11న విచారణ చేపట్టనున్నట్టు ఉన్నత న్యాయం స్థానం చెప్పింది.
Read Also: Rohit Sharma: ఆస్ట్రేలియాతో మ్యాచ్కు స్పిన్ బౌలర్లు ఎవరెవరంటే..!
అంతకుముందు.. కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం పిటిషన్ దాఖలు చేసింది.. దీనిపై అక్టోబర్ 5న విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు కార్మిక సంఘాల ఎన్నికలు పోస్ట్ పోన్ చేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. అయితే, ఈ నెలాఖరులోగా కార్మిక సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే సింగిల్ జడ్జి తీర్పు చెప్పింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని సింగరేణి డివిజన్ బెంచ్‌ను సింగరేణి సంస్థ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ సింగరేణి అప్పీలుపై తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కార్మిక శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!