భారతదేశపు తదుపరి స్టార్టప్ పవర్‌హౌస్‌గా హైదరాబాద్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. భారతదేశంలోని మొదటి ఐదు స్టార్టప్ హబ్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే టెక్ హబ్‌గా పేరున్న బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, పుణె నగరాలు మన కంటే ముందున్నాయి.
12 మీటర్ల పొడవు గల ఈ గ్రీన్ లగ్జరీ ఏసీ బస్సులు అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 35 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో ప్రతి సీటు దగ్గర మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్ ల్యాంప్ లను ఏర్పాటు చేశారు.
దేశంలో నరేంద్ర మోడీ 3.50 కోట్ల ఇళ్లను కట్టించాడని మన పక్క రాష్ట్రమైన ఏపీలో 20 లక్షల ఇల్లు కట్టించాడని సర్వేలు చెప్తున్నాయని ఈటెల రాజేందర్ అన్నారు. పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చకుండా పేదల కళ్ళల్లో కేసీఆర్ ప్రభుత్వం మట్టి కొట్టిందని ఆయన ఆరోపించారు.
రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉచిత, నిర్బంధ, విద్య హక్కు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని పిటీషనర్ వాదనలు వినిపించాడు.
ఏటీఎం అంటే ఒకప్పుడు బ్యాంక్ కు సంబందించి డబ్బులను డ్రాచేసుకోవడానికి వాడేవారు.. కానీ ఇప్పుడు మాత్రం ఈ మెషిన్ ను బంగారాన్ని కూడా డ్రా చేస్తున్నారు.. ఇక ఇప్పుడు హెల్త్ ఏటిఎం మిషన్ కూడా అందుబాటులోకి వచ్చింది.. దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ లో హెల్త్ ఏటిఎం మిషన్ ప్రారంభించారు.. దీన్ని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు.. ఈ ఏటిఎం కు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఒక్కసారి ఆ…
High Interest: పేద, సామాన్య ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ బిందాస్ గా వడ్డీ వ్యాపారాన్ని సాగిస్తూ పేద ప్రజలను దోచుకుంటున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో సామాన్య కుటుంబం బతకడం కష్టంగా మారింది.
వినాయక చవితి పండగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారిక నివాసం ప్రగతి భవన్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మట్టి గణపతిని ఏర్పాటు చేసి.. ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. అనంతరం కేసీఆర్ దంపతులతో పాటు కేటీఆర్, శైలిమ దంపతులు పూజలు చేశారు.
ఐఎస్ సదన్ పోలీసు స్టేషన్లో ఘటన జరిగింది. ఐఎస్ సదన్ భానునగర్ కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఓ ప్రయివేట్ ఫైనాన్షియర్ దగ్గర లక్ష రూపాయలు అప్పు చేశాడు. ఇటీవల అసలు, వడ్డీ కలిపి రిజ్వాన్ అప్పు తీర్చాడు.. కానీ చక్రవడ్డి ఇవ్వలేదని రెండు రోజుల క్రితం నాంపల్లికి చెందిన ఓ ముఠా ఐఎస్ సదన్ నుంచి మాజీ హోంగార్డ్ ను కిడ్నాప్ చేసి నాంపల్లిలోని ఓ భవనంలో రెండు రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేసింది.
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఉన్నతాధికారుల బృందం అక్టోబర్ 3 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా సందర్శించనుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ పేర్కొన్నారు.
Hyderabad: హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నేటి నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నగరంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పోలీసులు అప్రమత్తమయ్యారు.