E-Waste Bins: హైదరాబాద్‌లో మొట్టమొదటి పబ్లిక్ ఇ-వేస్ట్ కలెక్షన్ బిన్ ఏర్పాటు చేసిన సివిటాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E-Waste Bins: శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన ఇద్దరు దూరదృష్టి గల హైస్కూల్ విద్యార్థులు రిత్విక్ జంపన, సిదీష్ రెడ్డిలు మొట్ట మొదటి పబ్లిక్ ఇ-వేస్ట్ కలెక్షన్ బిన్‌ను రూపొందించారు. దానిని హైదరాబాద్‌లో చే శక్తి వంతమైన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (ఎన్జీఓ) సివిటాస్ మొట్ట మొదటి పబ్లిక్ ఇ-వేస్ట్ కలెక్షన్ బిన్‌ను ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది. భారతదేశంలో వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులను మార్చడానికి, వెనుకబడిన వర్గాలకు తమ మద్దతు విస్తరించాలనే సివిటాస్ మిషన్‌లో ఈ ముఖ్యమైన సందర్భం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
పర్యావరణ సుస్థిరత, సామాజిక బాధ్యత పట్ల తిరుగులేని నిబద్ధతతో, సివిటాస్ ఇప్పటికే హైదరాబాద్ వ్యర్థ పదార్థాల నిర్వహణ విభాగంలో ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది. ఈ సంస్థ 20కి పైగా నివాస సముదాయాల్లో ఇ-వేస్ట్, ఫాబ్రిక్ వ్యర్థాల సేకరణ డబ్బాలను ఏర్పాటు చేసింది, యెంకపల్లి, జీవన్‌గూడ గ్రామాలలో వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను నెలకొల్పింది, ఇది రోజుకు 1000 కిలోల తడి, పొడి చెత్తను రీసైకిల్ చేస్తుంది. హైదరాబాద్‌లోని రాగ్‌పిక్కర్లకు 500 అవసరమైన ఆరోగ్య కిట్‌లు పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమాలు పరిశుభ్రమైన కమ్యూనిటీలకు మాత్రమే కాకుండా అట్టడుగు వ్యక్తుల జీవనోపాధిని మెరుగుపరిచాయి. సివిటాస్ ఇప్పుడు తమ ఇ-వేస్ట్ కలెక్షన్ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ అంతటా విస్తరించడం ద్వారా తమ తదుపరి దశ ప్రయాణాన్ని ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) సహకారంతో సివిటాస్ సెప్టెంబర్ 1వ తేదీన మాదాపూర్‌లో తమ తొలి ఇ-వేస్ట్ బిన్‌ను విజయవంతంగా ఆవిష్కరించింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను బాధ్యతాయుతంగా సేకరించి, పారవేసేందుకు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో కనిపించే ప్రమాదకర పదార్థాలు, టాక్సిన్స్ నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు ఇది నగరవ్యాప్త కార్యక్రమానికి నాంది పలికింది.
Also Read
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
Also Read: Winter Season : చలికాలంలో పండించే కూరగాయల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
అంతే కాకుండా, వారు స్థానిక నీటి-కుంటలను శుభ్రపరచటం నుంచి యూఎస్, యూఏఈతో సహా మూడు దేశాలలో కార్యకలాపాలను నిర్వహించడం వరకు వారి ఇతర కార్యక్రమాలలో సహాయం చేయడానికి యువజన గ్రూప్లను తయారు చేయడం ద్వారా 200+ యువతను మిషన్‌లో నిమగ్నం చేశారు. సమిష్టి కార్యకలాపాల యొక్క శక్తిని ఉపయోగించడం ద్వారా, మేము అందరికీ స్థిరమైన, సమగ్ర మైన భవిష్యత్తును సృష్టించగలమని వారు విశ్వసిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కలెక్షన్ డబ్బాల్లో తమ ఇ-వ్యర్థాలను బాధ్యతాయుతంగా పారవేయడం ద్వారా ఈ కీలకమైన ప్రయత్నంలో తమతో కలిసి రావాలని సివిటాస్ హైదరాబాద్ వాసులందరినీ అభ్యర్ధించింది. సమీప భవిష్యత్తులో మరిన్ని మార్పులు చేయాలని వారు ఎదురుచూస్తున్నారు. మరో 5 పబ్లిక్ ఇ-వేస్ట్ బిన్‌లను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు అమలులో ఉన్నాయి. అదనంగా, ఈ సంస్థ నగరం చుట్టూ ఉన్న ర్యాగ్ పికర్స్‌కు సరసమైన ఆరోగ్య సంరక్షణ (ఆరోగ్యశ్రీ) అందించాలని చూస్తోంది, “ఇది ఇప్పుడు తమ ప్రధాన లక్ష్యం” అని వ్యవస్థాపకులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?