Woman Fell in to Hussain Sagar Nala at Gandhinagar: హైదరాబాద్‌లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు వేగంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతైంది. తన అమ్మ కనిపించడం లేదని సదరు…
Heavy Rain in Telangana State: ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో కొన్ని చోట్ల జనజీవనం స్తంభించింది. ఆదివారం నుంచి నిజామాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం…
IT company turned the board in Hi-Tech City: నిరుద్యోగులు మరోసారి మోసపోయారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ట్రైనింగ్ సహా ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగుల నుంచి కోట్లు గుంజిన సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాహకులు చేతులెత్తేశారు. దాంతో ఉద్యోగులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి…
హైదరాబాద్ ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి అక్కా తమ్ముడిపై శివకుమార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంఘవి, పృథ్వీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
బీజేపీ పార్టీలో మాజీ ఎంపీపీలు, పలు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు స్థానికంగా సభలు పెట్టీ జాయిన్ కానున్నారు అని ఈటెల రాజేందర్ అన్నారు. మీడియాలో కన్ఫ్యూజ్ చేసే వార్తలు రాస్తున్నారు.. కన్ఫర్మ్ చేసుకుని రాయండి అంటూ ఆయన సెటైర్ వేశాడు.
హైదరాబాద్ లో మరో సారి భారీగా డ్రగ్స్ ని అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అడ్డగా కొనసాగుతున్న డ్రగ్స్ దందాకి అధికారులు ఫుల్ స్టాప్ పెట్టారు. లావోస్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన నలుగురు మహిళల నుంచి 5 కిలోలకు పైగా కోకాన్ ను స్వాధీనం చేసుకున్నారు.
హైదర్ గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా ఉన్న వై జంక్షన్ దగ్గర రన్నింగ్ లో ఉన్న ఆటోపై చెట్టుకూలి డ్రైవర్ స్పాట్ లోనే మరణించాడు. ఈ సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహమ్మద్ గౌస్ పాషా రాజ్ భవన్ రోడ్డు లోని ఎమ్మెస్ మక్తా వాసిగా గుర్తించారు.