హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ షాప్స్ బంద్ చేస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో వైన్స్ షాపులు బంద్ చేస్తున్నాట్లు ప్రకటించారు.
రాచకొండ పరిధిలో వినాయక నిమ్మజ్జనోత్సవంకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాము అని రాచకొండ కమిషనర్ చౌహాన్ తెలిపారు. సాఫీగా, సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నాము.. దేశంలోనే తెలంగాణలో ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగే నిమజ్జనం పెద్దదని భావిస్తున్నాం.. ఇతర ప్రాంతాల నుంచి నిమజ్జనం చూడటానికి వస్తారు అని ఆయన అన్నారు.
గవర్నర్ తమిళిసైకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సపోర్ట్ గా నిలిచాడు. కవులు, కళాకారులు, సేవ చేసే వారికి గవర్నర్, రాష్ట్రపతి కోటాలో అవకాశం కల్పిస్తారు.
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే, నేడు కూడా హైదరాబాద్ నగరం సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటిచింది.
Uppal Stadium is Ready for ICC ODI World Cup 2023 with New Look: వన్డే ప్రపంచకప్ 2023 భారత్లో జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. భారత్లోని మొత్తం 10 మైదానాల్లో ప్రపంచకప్ మ్యాచ్లు జరగనున్నాయి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం) కూడా ప్రపంచకప్ మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనుంది. రెండు వార్మప్ మ్యాచ్లతో పాటు మూడు ప్రధాన మ్యాచ్లు ఉప్పల్…
హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ప్రొఫెషనల్స్ కార్ల ర్యాలీ తీశారు. నేడు (ఆదివారం) తెల్లవారుజాము నుంచే ఈ ర్యాలీ స్టార్ట్ అయింది. కారులతో సంఘీభావ యాత్ర అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు అందించింది. యూజీసీ ఎరియర్స్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో పాటు డీఎంఈ పరిధిలో పని చేస్తున్న ప్రొఫెసర్ల బదిలీకి పచ్చ జెండా ఊపింది. నెల రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.