మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులిటెన్ ను యశోదా ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. కత్తి గాయాలతో కొత్త ప్రభాకర్ రెడ్డి మా ఆస్పత్రికి తీసుకొచ్చారు..CT స్కాన్ చేశాం.. చిన్న పేగుకి 4 చోట్ల రంధ్రాలు పడ్డాయి.. చిన్న పేగు 15 సెంటీ మీటర్ల మేర కట్ చేసి సర్జరీ చేశామని డాక్టర్లు వెల్లడించారు. లాప్రో స్కోప్ ద్వారా సర్జరీ చేద్దాం అనుకున్నాం.. కానీ మల్టిపుల్ ఇంజురీస్ కనిపించాయి.. త్వరగా తీసుకురావడం వల్లే.. ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం తప్పింది.. రక్తస్రావం ఎక్కువ అయ్యేది.. మూడు నాలుగు రోజులు ఐసీయులో డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలన్నారు.
Read also: Dunki : డంకీ టీజర్‌పై అప్‌డేట్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్..
మరో 10 రోజులు హాస్పిటల్ లోనే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండాల్సి వస్తుంది అని యశోదా హస్పటల్ వైద్యులు వెల్లడించారు. షార్ప్ ఆబ్జెక్ట్ అవడంతో.. డెప్త్ ఎక్కువగా ఉంది. రెండు లేయర్లు కట్ అయింది.. ల్యాప్రాటమీ అనేది మెడికల్ టెర్మినాలజీ లో చాలా పెద్దది. ఆ సర్జరీ ప్రభాకర్ రెడ్డికి చేశాం.. బొడ్డుకి కుడిభాగాన 6 సెంటీమీటర్ల కత్తి ఘాటు జరిగింది.. సిటి స్కాన్ లో శరీరం లోపల బ్లీడింగ్ అవుతునట్టు గుర్తించాం.. చిన్న పేగుకి 4 చోట్ల గాయం ఐనట్టు తేలింది.. కీ హోల్ తో సర్జరీ చేయలేము అని గుర్తించాం.. వెంటనే హాస్పిటల్ తీసుకురావడంతో ఇన్ఫెక్షన్ కాకుండా ఆపగలిగాం.. ప్రాణాపాయం తప్పింది.. 15 సెంటీమీటర్ లు చిన్న పేగు తొలగించి కుట్లు వేశాం.. 10 రోజుల వరకు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది.. దాదాపు 100 మంది వైద్యులు ఒక టీం గా పని చేసాము..
కత్తి గాటు లోపల ఎక్కువగా వుంది అని డాక్టర్లు పేర్కొన్నారు.