Hyderabad: ఈ ప్రపంచం లో ప్రతి జీవికి నీరు అనేది చాల అవసరం. ఎందుకంటే నీరు లేకుండా ఏ జీవి బ్రతక లేదు. అందుకే భావితరాల భవిష్యత్తు కోసం నీటిని పొదుపు చెయ్యండి అంటారు. అయితే భావితరాల భవిష్యత్తును పక్కన పెడితే హైదరాబాద్ ప్రజలు ప్రస్తుతం ఉన్న వాళ్ళ భవిష్యత్తు గురించి అలోచించి నీటిని వాడుకోవాలి. ఒక చుక్క నీటిని కూడా వృద్దా కానివ్వకూడదు. ఎందుకంటే మంజీరా వాటర్ భాగ్యనగరంలో బంద్ అయింది. వివరాల లోకి వెళ్తే.. మంజీరా వాటర్ సరఫరా పైపుల ద్వారా జరుగుతుందని అందరికి తెలిసిన విషయమే.
Read also:India’s biggest Data leak: షాకింగ్ న్యూస్.. ఇంటర్నెట్లో 81.5 కోట్ల మంది డేటా
అయితే గత కొంతకాలంగా ఆ పైపుల ద్వారా నీరు సరఫరా అయ్యే సమయంలో అక్కడక్కడా పైపుల నుండి నీరు లీక్ అవుతుంది. దీని వల్ల సిటీకి వచ్చే నీరు చాలా వరకు తగ్గిపోతోంది. ఈ సమస్య చాలా కాలం నుండి ఉంది. అయితే ఆ లీకేజ్ పైపుల రిపేర్ పనులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ లీకేజ్ పైపులను రిపేర్ చెయ్యించాలని అధికారులు నిర్ణయించారు. దీని కారణంగా బుధవారం నుండి గురువారం వరకు అంటే 24 గంటలు నగరంలో మంజీరా వాటర్ సరఫరా నిలిచిపోతుంది. గురువారం ఏ సమయానికి నీళ్లు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి. కనుక నగర వాసులంతా సరిపడా నీటిని ఈరోజే పట్టి పెట్టుకోవాలి. లేకపోతే త్రాగు నీరు సమస్యతో ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది.