Hyderabad Man Rayees Uddin stabbed to death in London: లండన్‌లో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఖాజా రైసుద్దీన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. 65 ఏళ్ల రైసుద్దీన్.. వెస్ట్ యార్క్‌షైర్‌లోని హిల్ టాప్ మౌంట్ ప్రాంతంలో చంపబడ్డాడు. దుండగులు కత్తితో పొడిచి అతడిని దారుణంగా చంపేశారు. అనంతరం రైసుద్దీన్ వద్ద ఉన్న నగదును దుండగులు దోచుకున్నారని సమాచారం తెలుస్తోంది. రైసుద్దీన్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు లండన్‌లోని భారత హైకమిషన్ ప్రయత్నాలు…
తెలంగాణలో ఎన్నికల పోరు మరింత హీట్ పెంచబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలోఎలక్షన్ ఫీవర్ కనిపిస్తుండగా.. తాజాగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ అధికారుల రాకతో తెలంగాణ పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లబోతుంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారులు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉన్న జిల్లా పౌరహక్కుల సంఘం నేత ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఈరోజు తెల్లవారుజామున నుంచి సోదాలు చేపట్టారు.
ICC వరల్డ్ కప్ 2023కి ముందు స్టార్ పాకిస్థాన్ ఆల్-రౌండర్ షాదాబ్ ఖాన్ తన పేలవమైన ఫామ్‌ను అంగీకరించాడు. షాదాబ్ ఖాన్ తన అధ్వాన్నమైన బౌలింగ్ ప్రదర్శనలు అతని మానసిక స్థితిపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయని చెప్పాడు. షాదాబ్ ఖాన్ బ్యాట్, బాల్ రెండింటిలోనూ రానించగల సత్తా ఉంది. అయితే ఈ ఆల్ రౌండర్ 2023 ఆసియా కప్‌లో 4.33 సగటుతో 13 పరుగులు మాత్రమే చేశాడు. 40.83 సగటుతో కేవలం ఆరు వికెట్లు తీశాడు.
Modi Posters: నిజామాబాద్ జిల్లాలో మంచిప్పలో పోస్టర్ల కలకలం సృష్టించాయి. మోడీ పర్యటన నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. ఓట్ల కోసం మా ఇళ్ల కు రావొద్దంటు మంచిప్ప రిజర్వాయర్ నిర్వాసితులు ప్రతి ఇంటికి పోస్టర్లు అతికించుకున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలో 100 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రతిష్టాత్మక సైకిల్ ట్రాక్‌ను ఇవాళ (ఆదివారం) సాయంత్రం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
హుస్సేన్ సాగర్ సరసన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ తీర్చిదిద్దిన లేక్ ఫ్రంట్ పార్క్ రేపటి (అక్టోబర్ 1వ తేదీ) నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది.
దాదాపు 2.75 కోట్ల రూపాయలతో బాగ్ అంబర్ పేట డివిజన్ రామకృష్ణా నగర్ లోని మోహిన్ చెరువు, స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు.