ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారం స్పీడును పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. సమ్మక్క, సారలమ్మ, యాదాద్రీశుడిని నమస్కరిస్తూ మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులుకదుపుతోన్న బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారం స్పీడును పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభను ఏర్పాటు చేసింది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా కాటరాక్ట్ ఆపరేషన్ను నిర్వహించారు. చంద్రబాబుకు 45 నిమిషాల్లో కాటరాక్ట్ ఆపరేషన్ను వైద్యులు పూర్తి చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5: 25 నుంచి 6: 15 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాకతో రేపు హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజ్ భవన్, ఎల్బీస్టేడియం సభ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా ఉన్నతాధికారుల సూచనలతో ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్ లను మూసివేయాలని (HMDA) నిర్ణయం తీసుకుంది.
ముషీరాబాద్ కు చెందిన నగేష్ ముదిరాజ్ మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 2018లో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో ఎన్నికలకు వచ్చింది అని ఆయన గుర్తు చేశారు.
Hyderabad Metro: మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ఒక రోజులో ప్రయాణించే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది. మూడు కారిడార్లలో ఒక్కరోజే 5.47 లక్షల మంది మెట్రో మార్గాల్లో ప్రయాణించారు.
ప్రేమ అంటే ప్రాణం తియ్యడం కాదు. ప్రాణం పోయే వరకు ప్రేమించిన వాళ్ళ సంతోషాన్ని కోరుకోవడం. పేమించడం అంటే ప్రేమను ఇవ్వడం.. తిరిగి ఆశించకపోవడం. కానీ ప్రస్తుతం ప్రేమ పేరుతో దారుణాలకు పాలపడుతున్నారు యువత. ప్రేమ పేరుతో ప్రాణం తీసుకుంటున్నారు. లేదా ప్రాణాలను తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. చిన్ననాటి స్నేహితురాలు.. ప్రస్తుతం ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ప్రియురాలి పైన దాడి చేసి.. తాను ఆత్మహత్యా…